Share News

Viral Video: గాల్లో విహరిస్తున్న పారాగ్లైడర్.. కింద నుంచి లైటర్ అడిగిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Jan 11 , 2025 | 05:09 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కళ్లతో చూసింది ఆ మరుక్షణమే వీడియో రూపంలో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది వింత వింత పనులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు చేసే చిత్రవిచిత్రమైన పనులు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ..

Viral Video: గాల్లో విహరిస్తున్న పారాగ్లైడర్.. కింద నుంచి లైటర్ అడిగిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కళ్లతో చూసింది ఆ మరుక్షణమే వీడియో రూపంలో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది వింత వింత పనులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు చేసే చిత్రవిచిత్రమైన పనులు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సిగరెట్ వెలిగించుకోవడానికి ఓ వ్యక్తి గాల్లో విహరిస్తున్న పారాగ్లైడర్‌ను లైటర్ అడిగాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు పర్యాటకులు కొండ పైకి ఎక్కి, అక్కడి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సమయంలో వారిలో ఓ వ్యక్తికి సిగరెట్ తాగాలని అనిపించింది. అయితే అతడి వద్ద సిగరెట్ ఉంది కానీ.. లైటర్ మాత్రం మర్చిపోయాడు. చుట్ట పక్కల ఉన్న వారిని అడిగినా ఫలితం లేదు. ఇలా నిరాశలో ఉండగా అతడికి గాల్లో ఎగురుతున్న పారాగ్లైడర్ (Paraglider) కనిపించాడు. ‘‘ఇంతమందిని అడిగాం.. ఇతన్ని కూడా ఓ మాట అడిగేస్తే పోలా’’.. అని అనుకుంటాడు.

Optical illusion: మీ కంటికి పెద్ద పరీక్ష.. ఈ చిత్రంలో దాక్కున్న 3 ముఖాలను 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


అనుకున్నదే తడవుగా గాల్లో ఉన్న పారాగ్లైడర్‌ను పిలుస్తూ ‘‘బ్రదర్.. మీ వద్ద లైటర్ ఉంటే ఇస్తావా’’.. అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ మాటలు విన్న పారాగ్లైడర్‌ వెంటనే స్పందిస్తాడు. చూస్తుండగానే అంతెత్తు నుంచి అందేంత ఎత్తులోకి వస్తాడు. కింద ఉన్న వ్యక్తికి తన చేతిలో ఉన్న లైటర్‌‌ను ఇచ్చి.. మళ్లీ గాల్లోకి దూసుకెళ్తాడు. లైటర్ (lighter) అడిగిన వెంటనే గాల్లో నుంచి కిందకు వచ్చి ఇవ్వడం చూసి.. అక్కడున్న వారంతా తెగ నవ్వుకుంటారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే. సిగరెట్ వెలిగించుకున్న తర్వాత అంతే మర్యాదగా ఆ వ్యక్తి పారాగ్లైడర్‌‌ను కిందకు పిలిచి లైటర్‌ను తిరిగి ఇచ్చేశాడు.

Viral Video: ఈ మొసలి ఎర మామూలుగా లేదుగా.. మనుషులను ఎలా నమ్మిస్తోందో చూడండి..


ఈ వీడియోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను ఎంత మంచి వ్యక్తి.. లైటర్ ఇవ్వాలనుకుంటే పైనుంచి విసిరేయవచ్చు.. కానీ కిందకు వచ్చి చేతికి అందించడం గ్రేట్’’.. అఃంటూ కొందరు, ‘‘ధూమపానం చేసే వారి యూనిటీ ఇలాగే ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22 లక్షలకు పైగా లైక్‌లు, 19.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 11 , 2025 | 05:09 PM