Share News

IND vs ENG: రెండో టీ20కి ముందు భారత్‌కు బిగ్ షాక్.. అసలైనోడే మిస్ కాబోతున్నాడు

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:58 PM

India Playing 11: ఈడెన్ గార్డెన్స్‌ టీ20లో ఘనవిజయం సాధించిన భారత్.. అదే జోరులో చెపాక్ మ్యాచ్‌లోనూ గ్రాండ్ విక్టరీ కొట్టాలని చూస్తోంది. అందుకోసం ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. అయితే సరిగ్గా మ్యాచ్ డే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది.

IND vs ENG: రెండో టీ20కి ముందు భారత్‌కు బిగ్ షాక్.. అసలైనోడే మిస్ కాబోతున్నాడు
Team India

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లో వన్‌సైడ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఆల్‌రౌండర్లు, పించ్ హిట్టర్లతో నిండిన పటిష్టమైన ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ప్రత్యర్థి బజ్‌బాల్‌ను వాళ్ల మీదే ప్రయోగించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఇదే జోరులో చెన్నైలోని చెపాక్ వేదికగా శనివారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ విజయబావుటా ఎగురవేయాలని చూస్తోంది సూర్య సేన. వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఫుల్ ఫిట్‌నెస్ సాధించడంతో ఈ మ్యాచ్‌లో అతడు కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మరో మ్యాచ్ విన్నర్ టీమ్‌కు దూరమవడం భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అతడు ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..


నో ఆప్షన్!

చెపాక్ టీ20కి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. తొలి మ్యాచ్ హీరో, విధ్వంసక యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నెట్ సెషన్ సమయంలో చీలమండ గాయంతో అతడు బాధపడ్డాడని వినిపిస్తోంది. అభిషేక్ ఇంజ్యురీ గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ అతడు గాయంతో ఇబ్బంది పడుతున్నాడని క్రికెట్ వర్గాల సమాచారం. ఒకవేళ అభిషేక్ ఈ మ్యాచ్‌కు దూరమైతే అతడి ప్లేస్‌లో ఓపెనర్‌గా ఎవరు వస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అభిషేక్‌‌-సంజూ శాంసన్‌కు వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరో బ్యాకప్ ఓపెనర్‌ను తీసుకోలేదు.


రెండో ఓపెనర్‌గా ఎవరు?

బ్యాకప్ ఓపెనర్ లేరు కాబట్టి ఉన్న స్క్వాడ్‌లో నుంచి ఒకరు ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సంజూకు తోడుగా స్వయంగా సారథి సూర్యకుమార్ యాదవ్ మరో ఓపెనర్‌గా దిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఓపెనింగ్ ప్రెజర్‌ను ఇతరుల మీద నెట్టకుండా తానే ఆ భారాన్ని మోయాలని మిస్టర్ 360 అనుకుంటున్నాడని సమాచారం. ఒకవేళ అదే జరిగితే తిరిగి ఫామ్‌ను అందుకునేందుకు అతడికి ఇది బెస్ట్ చాన్స్ అనే చెప్పాలి. కాగా, ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో మరో రెండు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. తెలుగోడు నితీష్ రెడ్డి స్థానంలో వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు బదులు వెటరన్ పేసర్ షమీని రీప్లేస్ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.


ఇవీ చదవండి:

చెపాక్‌లోనూ చెక్‌ పెట్టాలని..

ఖేలో ఇండియా గేమ్స్‌లో నయనకు స్వర్ణం

అయ్యో.. జొకో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 25 , 2025 | 12:59 PM

News Hub