Share News

Arshdeep Singh: అర్ష్‌దీప్ స్టన్నింగ్ డెలివరీ.. బ్యాటర్ ఫ్యూజులు ఎగిరాయి

ABN , Publish Date - Jan 08 , 2025 | 09:08 AM

టీమిండియా యంగ్ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఏటికేడు తనను తాను మరింతగా మెరుగుపర్చుకుంటున్నాడు. టాప్ నాచ్ బౌలింగ్‌తో వారెవ్వా అనిపిస్తున్నాడు. తాజాగా ఓ స్టన్నింగ్ డెలివరీతో బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరేలా చేశాడు.

Arshdeep Singh: అర్ష్‌దీప్ స్టన్నింగ్ డెలివరీ.. బ్యాటర్ ఫ్యూజులు ఎగిరాయి
Arshdeep Singh

టీమిండియా యంగ్ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఏటికేడు తనను తాను మరింతగా మెరుగుపర్చుకుంటున్నాడు. టాప్ నాచ్ బౌలింగ్‌తో వారెవ్వా అనిపిస్తున్నాడు. లెఫ్టార్మ్ పేసర్ లేక చాన్నాళ్ల పాటు ఇబ్బంది పడిన భారత జట్టు కష్టాలు తీరుస్తున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో తన బెర్త్‌ను పర్మినెంట్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. టీమ్ ఆడే ప్రతి మేజర్ టోర్నీలోనూ అతడు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటూ మంచి కాంట్రిబ్యూషన్ అందిస్తున్నాడు. అయితే టెస్ట్ టీమ్‌లోకి మాత్రం రాలేకపోతున్నాడు. అందుకోసం డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఇతర దేశాల్లోనూ క్లబ్, కౌంటీ క్రికెట్ ఆడుతూ తనను తాను మరింత రాటుదేల్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ తరుణంలోనే ఓ మ్యాచ్‌లో స్టన్నింగ్ స్పెల్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఒక డెడ్లీ బాల్‌తో బ్యాట్స్‌మన్‌కు ఫీజులు ఎగిరేలా చేశాడు అర్ష్‌దీప్.


వాటే స్వింగ్!

పొడగరి అయిన అర్ష్‌దీప్ వికెట్ నుంచి బౌన్స్, స్వింగ్ లభిస్తే మరింత చెలరేగుతాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లోని ఓ మ్యాచ్‌లో అదే జరిగింది. బుల్లెట్ పేస్‌తో పరిగెత్తుకుంటూ వచ్చిన అర్ష్‌దీప్ అంతే వేగంతో బంతిని విసిరాడు. గుడ్ లెంగ్త్‌లో పడిన బంతిని బ్యాట్స్‌మన్ డిఫెన్స్ చేయబోయాడు. అయితే పిచ్ అయ్యాక దిశను మార్చుకున్న బంతి లోపలి వైపు అనూహ్యంగా స్వింగ్ అయింది. బ్యాట్‌ను దాటుకొని వెళ్లి వికెట్లను పడేసింది. బంతి స్వింగ్ అయిన తీరుకు బ్యాటర్ బిత్తరపోయాడు. ఇదేం బాల్ అంటూ పిచ్చోడైపోయాడు. బౌలింగ్ టీమ్ ఆటగాళ్లు కూడా వారెవ్వా.. వాటే బాల్ అంటూ అర్ష్‌దీప్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.


టెస్టుల్లో ఆడించాల్సిందే!

కౌంటీల్లో అర్ష్‌దీప్ బౌలింగ్ చేస్తున్న తీరు, పిచ్ నుంచి అతడు స్వింగ్ రాబడుతున్న విధానానికి అంతా ఫిదా అయిపోయారు. ఇంత మంచి బౌలర్, అందునా లెఫ్టార్మ్ పేసర్ కాబట్టి టీమిండియా టెస్ట్ టీమ్‌లోకి అతడ్ని తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. లెఫ్టార్మ్ పేసర్ ఉంటే మన బౌలింగ్ అటాక్‌ మరింత వైవిధ్యంగా మారుతుందని సూచిస్తున్నారు. అర్ష్‌దీప్‌ను మరింత సానబెడితే జస్‌ప్రీత్ బుమ్రాకు సరిజోడీ అవుతాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, కౌంటీలు ముగిసిన తర్వాత త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల్లో పాల్గొననున్నాడు అర్ష్‌దీప్ సింగ్.


ఇవీ చదవండి:

గాయాలతో సహవాసం

షమి పరిస్థితేంటి? ప్రశ్నించిన శాస్త్రి

ప్రియుడితో ఒసాక కటీఫ్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 08 , 2025 | 09:11 AM