Team India: ఏ భారత బౌలర్‌కూ అందని క్రేజీ రికార్డు.. అడుగు దూరంలో అర్ష్‌దీప్
ABN , Publish Date - Jan 23 , 2025 | 08:32 PM
Arshdeep Singh Crazy Record: టీమిండియా యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓ పాత రికార్డుకు పాతర వేసిన ఈ పంజాబీ పుత్తర్.. సెకండ్ టీ20లో మరో క్రేజీ రికార్డు మీద కన్నేశాడు.

భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఫుల్ జోరు మీదున్నాడు. నిఖార్సయిన లెఫ్టార్మ్ పేస్‌తో ప్రత్యర్థులకు పోయిస్తున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ లాంటి సీనియర్ స్పీడ్‌స్టర్లు లేకపోయినా ఈ పంజాబీ పుత్తర్ ఆ లోటు కనిపించకుండా అదరగొడుతున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో అపోజిషన్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో అదిరిపోయే బౌలింగ్‌తో ఓ పాత రికార్డుకు పాతర వేశాడు అర్ష్‌దీప్. ఇప్పుడు మరో క్రేజీ రికార్డు మీద అతడు కన్నేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇంకో 3 చాలు!
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లో ఇద్దరు ఇంగ్లీష్ ఓపెనర్లను ఔట్ చేసిన అర్ష్‌దీప్.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు (97 వికెట్లు) తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు)ను అతడు అధిగమించాడు. వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా లెజెండ్ అనిల్ కుంబ్లే ఉండగా.. టీ20ల్లో ఆ ఘనతను అందుకున్నాడు అర్ష్‌దీప్. దీంతో అతడు తోపు అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఇంగ్లండ్‌తో సెకండ్ టీ20లో గనుక మరో 3 వికెట్లు తీస్తే.. పొట్టి ఫార్మాట్‌లో 100 వికెట్ల మైలరాయిని చేరుకున్న తొలి భారత బౌలర్‌గా అతడు మరో క్రేజీ రికార్డును క్రియేట్ చేస్తాడు. మరికొన్నేళ్లు ఇదే తరహాలో అతడు టీ20ల్లో నిలకడగా వికెట్లు తీస్తూ పోతే పొట్టి ఫార్మాట్ లెజెండ్ స్థాయిని అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
రంజీల్లో తుస్సుమన్న స్టార్లు.. తప్పంతా బీసీసీఐదే
కోహ్లీని భయపెడుతున్న సూర్య.. అనుకున్నదే అవుతోంది
వచ్చాడు.. ఔట్ అయ్యాడు.. రిపీట్.. దేవుడే కాపాడాలి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి