Share News

BCCI: టీమిండియాలో వణుకు.. డేంజర్ రూల్‌ను మళ్లీ తీసుకొస్తున్న బీసీసీఐ

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:55 AM

Team India: టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వెన్నులో వణుకు పుట్టించే మరో నిబంధనను అమల్లోకి తీసుకురానుందని సమాచారం. మరి.. ఏంటా రూల్? అనేది ఇప్పుడు చూద్దాం..

BCCI: టీమిండియాలో వణుకు.. డేంజర్ రూల్‌ను మళ్లీ తీసుకొస్తున్న బీసీసీఐ
Team India

ఏ రంగంలోనైనా ఫలితాలే అన్నీ నిర్ణయిస్తాయి. అందుకు క్రికెట్ కూడా మినహాయింపేమీ కాదు. జెంటిల్మన్ గేమ్‌లో సక్సెస్ ఉన్నంత వరకు ప్రశంసలు తప్ప ఇంకేమీ రావు. అదే పరాజయం ముద్దాడితే విమర్శలు, ట్రోల్స్ జడివానలా కురుస్తాయి. అప్పటివరకు చేసిందంతా మాయమైపోతుంది. ఫెయిల్యూర్ తప్ప ఎఫర్ట్ పెద్దగా కనిపించదు. అప్పటివరకు బలం అనుకున్నదే బలహీనతగా మారుతుంది. ఒక్కసారిగా తప్పులన్నీ బయటపడతాయి. ఇప్పుడు టీమిండియా పరిస్థితి అలాగే ఉంది. న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్, ఆసీస్‌పై ఓటమితో జట్టు తీవ్రంగా విమర్శలపాలవుతోంది. దీంతో భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటకెక్కిన పాత నిబంధనను బూజు దులిపి పట్టాలెక్కిస్తోందట బీసీసీఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..


కోహ్లీ ఐడియా రిపీట్!

ఒకప్పుడు టీమిండియాలో యోయో టెస్ట్‌తో ప్లేయర్ల ఫిట్‌నెస్‌ లెవల్స్‌ను నిర్థారించేవారు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సారథిగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని పక్కాగా పాటించేవారు. ఆటగాళ్లు అందరూ తనలా ఫుల్ ఫిట్‌గా ఉండాలని కోహ్లీ భావించేవాడు. దీంతో అప్పట్లో ఈ రూల్‌ను తప్పనిసరి చేసింది బీసీసీఐ. అయితే, ఈ టెస్ట్‌ను అధిగమించడంలో ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనే విమర్శలు రావడంతో బోర్డు దీన్ని పక్కన పెట్టేసింది. అయితే వరుస సిరీస్‌ల్లో వైఫల్యాలు, బుమ్రా-ఆకాశ్‌దీప్‌ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమవడంతో యోయో టెస్ట్‌ను మళ్లీ తీసుకురావాలని భారత బోర్డు సిద్ధమైందని సమాచారం.


ఫిట్‌నెస్ తప్పనిసరి!

ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో ఇక మీదట గందరగోళం ఉండొద్దని, ఫిట్‌గా ఉన్నవాళ్లే జట్టులో ఉండాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారట. సిరీస్‌కు ముందు స్క్వాడ్స్ ప్రకటించే టైమ్‌లో ప్లేయర్ల ఫిట్‌నెస్‌ను కొలిచేందుకు యోయో టెస్ట్‌ నిర్వహించాలని మెడికల్ టీమ్ నుంచి సూచనలు కూడా అందాయని వినిపిస్తోంది. ఫిట్‌నెస్ అంశాన్ని కొందరు ఆటగాళ్లు తేలిగ్గా తీసుకోవడం కూడా యోయో టెస్ట్‌ను మళ్లీ తీసుకురావడానికి ఒక కారణమని సమాచారం. దీంతో ఇన్నాళ్లూ ఫిట్‌నెస్‌ను లైట్ తీసుకుంటున్న ప్లేయర్ల వెన్నులో వణుకు పుడుతోందని.. ఇక దబిడిదిబిడేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

లగ్జరీ బంగ్లా కొన్న కోహ్లీ-అనుష్క.. కొత్త ఇంటికి అన్ని కోట్లా..

టీమిండియాకు కొత్త కోచ్.. గంభీర్‌కు గట్టి షాక్

ఆ మాటలు నమ్మొద్దు.. ఫ్యాన్స్‌కు బుమ్రా రిక్వెస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 16 , 2025 | 11:55 AM