Rohit Sharma: రోహిత్-కోహ్లీపై బ్యాన్.. స్టార్లకు ఉచ్చు బిగిస్తున్న బీసీసీఐ
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:47 PM
Virat Kohli: టీమిండియాకు మూలస్తంభం లాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద బ్యాన్ పడనుందా? అసలు భారత జట్టులో ఏం జరుగుతోంది? భారత క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి? కోహ్లీ-రోహిత్‌ను వణికిస్తున్న బీసీసీఐ రూల్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
భారత క్రికెట్‌లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్ అవడం, ఆస్ట్రేలియా టూర్‌లోనూ దారుణంగా ఓడటంతో భారత క్రికెట్ బోర్డు అలర్ట్ అయింది. జట్టులో ప్రక్షాళన షురూ చేసింది. జనవరి 11న నిర్వహించిన ఏజీఏంలో టీమ్ పెర్ఫార్మెన్స్‌ను రివ్యూ చేశారు బీసీసీఐ పెద్దలు. ఇందులో చాలా విషయాలపై డిస్కస్ చేశారట. హెడ్ కోచ్ గౌతం గంభీర్ అధికారాలకు కత్తెర వేయడం షురూ చేశారని తెలుస్తోంది. అదే సమయంలో జట్టుకు మూలస్తంభం లాంటి సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి కూడా కళ్లెం వేయాలని నిర్ణయించారట. ఈ క్రమంలోనే ఇద్దరిపై నిషేధం అంశం కూడా చర్చకు వచ్చిందని సమాచారం.
ఉక్కుపాదం!
రోహిత్-కోహ్లీపై బ్యాన్ ఏంటని టెన్షన్ పడుతున్నారా? నేరుగా వాళ్ల మీద కాదు.. ఆ ఇద్దరి పీఆర్ ఏజెన్సీలపై నిషేధం విధించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారని వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఈ ఇద్దరు స్టార్ల పీఆర్ ఏజెన్సీలు చేస్తున్న రాద్ధాంతం, టీమిండియాలో లుకలుకలకు ఇన్‌డైరెక్ట్‌గా కారణమవడం, ప్రతి విషయం మీద రచ్చ చేయడం, ఇతర ఆటగాళ్లను టార్గెట్ చేసుకొని నెట్టింట విద్వేషాలు సృష్టించడం వంటి వాటిపై బోర్డు పెద్దలు సీరియస్ అయ్యారట. అందుకే రోహిత్-కోహ్లీతో పాటు ఇతర టీమిండియా ఆటగాళ్ల పీఆర్ ఏజెన్సీలను రద్దు చేయాలనే యోచనలో ఉన్నారట. అయితే దీనిపై బోర్డు నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తే గానీ ఏదీ చెప్పలేం.
ఆ పోస్టుల వల్లే..!
రీసెంట్‌గా జరిగిన సిడ్నీ టెస్ట్‌లో రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు. దీంతో అతడికి మద్దతుగా విద్యాబాలన్, ఫర్హాన్ అక్తర్ వంటి పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు నెట్టింట పోస్టులు పెట్టారు. టీమ్ కోసం తన ప్లేస్‌ను త్యాగం చేసిన హిట్‌మ్యాన్ గ్రేట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. అసలు రోహిత్‌ను ఫాలో అవ్వని విద్యాబాలన్ అతడికి ఎలా సపోర్ట్ చేయడం ఏంటని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. ఇది హిట్‌మ్యాన్ పీఆర్ టీమ్ పనేననే విమర్శలు వచ్చాయి. ఇలాంటి పలు ఘటనలు జరిగిన నేపథ్యంలో ప్లేయర్లను సమర్థించడానికి వాళ్ల పీఆర్ టీమ్స్ చేస్తున్న స్టంట్స్, ఫేక్ న్యూస్ ప్రచారం తదితర విషయాలపై బీసీసీఐ పెద్దలు గుస్సా అయ్యారట. అందులో భాగంగానే పీఆర్ టీమ్స్‌పై ఉక్కుపాదం మోపే దిశగా డిస్కషన్స్ నడిచాయని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
టీమిండియాలో వణుకు.. డేంజర్ రూల్‌ను మళ్లీ తీసుకొస్తున్న బీసీసీఐ
లగ్జరీ బంగ్లా కొన్న కోహ్లీ-అనుష్క.. కొత్త ఇంటికి అన్ని కోట్లా..
టీమిండియాకు కొత్త కోచ్.. గంభీర్‌కు గట్టి షాక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి