IPL 2025: ఐపీఎల్ కెప్టెన్లకు బీసీసీఐ హుకుం.. వెంటనే రావాలంటూ..
ABN , Publish Date - Mar 18 , 2025 | 09:33 AM
BCCI: ఐపీఎల్ కెప్టెన్లకు భారత క్రికెట్ బోర్డు హుకుం జారీ చేసింది. వెంటనే ముంబై రావాల్సిందిగా ఆదేశించింది. బీసీసీఐ ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్‌కు టైమ్ దగ్గర పడుతోంది. ఈ శనివారం నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. అటు ఆటగాళ్ల నుంచి ఇటు అభిమానుల వరకు అంతా టోర్నమెంట్ ఆరంభం కోసం ఎదురు చూస్తున్నారు. ధనాధన్ ఆటతో వినోదాన్ని పంచాలని ప్లేయర్లు.. వాళ్ల విన్యాసాలు చూసి ఎంజాయ్ చేయాలని అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో ఐపీఎల్ కెప్టెన్లకు సమన్లు జారీ చేసింది భారత క్రికెట్ బోర్డు. బీసీసీఐ ఇలా ఎందుకు చేసింది.. అనేది ఇప్పుడు చూద్దాం..
చలో ముంబై..
ఐపీఎల్ 18వ ఎడిషన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీల కెప్టెన్లకు బీసీసీఐ ఆర్డర్ వేసింది. మార్చి 20వ తేదీన ముంబైకి రావాలని ఆదేశించింది. 22 నుంచి కొత్త సీజన్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో దానికి రెండ్రోజుల ముందు ముంబైలోని బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్‌లో మీటింగ్ నిర్వహిస్తున్నారట. ఇందులో లీగ్‌లోని 10 ఫ్రాంచైజీల కెప్టెన్స్‌తో పాటు ఆయా జట్ల మేనేజర్లు కూడా హాజరు కానున్నారట. ఒక గంట పాటు ఈ సమావేశం ఉండొచ్చని తెలుస్తోంది.
ప్లాన్ చేంజ్..
కొత్త ఎడిషన్‌లో చేసిన మార్పుచేర్పులు, రూల్స్‌పై ఐపీఎల్ కెప్టెన్స్, మేనేజర్స్‌తో చర్చిస్తారట బీసీసీఐ పెద్దలు. ఆ తర్వాత ముంబైలోని ప్రఖ్యాత తాజ్ హోటల్‌లో స్పాన్సర్ కార్యక్రమాలు, కెప్టెన్స్ ఫొటో షూట్, లంచ్ లాంటివి ఉంటాయని సమాచారం. సాధారణంగా ప్రతి ఐపీఎల్‌కు ముందు అన్ని జట్ల సారథులతో ఫొటోషూట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండటంతో ఈసారి కోల్‌కతాలో ఫొటోషూట్ జరగాల్సింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చాలా ఆలస్యంగా తమ కొత్త సారథి (అక్షర్ పటేల్) పేరును ప్రకటించడంతో కెప్టెన్స్-మేనేజర్స్‌తో బీసీసీఐ మీటింగ్ లేట్ అయిందట. దీంతో ఫొటోషూట్ తతంగాన్ని కూడా ముంబైలోనే పూర్తి చేయాలని బోర్డు పెద్దలు నిర్ణయించారని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
చాంపియన్స్ ట్రోఫీతో రూ.737 కోట్ల నష్టం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి