Share News

Champions Trophy 2025: ఎల్లుండి నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలు.. ఉచితంగా చూసేయండిలా..

ABN , Publish Date - Feb 17 , 2025 | 01:24 PM

Champions Trophy 2025 Live Streaming: చాంపియన్స్ ట్రోఫీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ మ్యాచుల్ని చూసి ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో మ్యాచులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయనేది ఇప్పుడు చూద్దాం..

Champions Trophy 2025: ఎల్లుండి నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలు.. ఉచితంగా చూసేయండిలా..
Champions Trophy 2025

చాంపియన్స్ ట్రోఫీ సంరంభం మొదలవడానికి మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. గతేడాది టీ20 వరల్డ్ కప్‌ చూసి ఎంజాయ్ చేసిన అభిమానులు.. ఈసారి వన్డే ఫార్మాట్‌లో జరిగే మెగా ఈవెంట్‌ను చూసేందుకు రెడీ అవుతున్నారు. టాప్-8 టీమ్స్ పోటీపడే ఈ మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి మొదలయ్యే ఈ టోర్నమెంట్‌లో భారత్ ఆడే మ్యాచులకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తోంది. మిగతా మ్యాచులన్నీ పాకిస్థాన్‌లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీని లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..


స్ట్రీమింగ్ అందులోనే!

చాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్ని ఉచితంగా చూసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అవకాశం ఇస్తోంది. ఐసీసీ.టీవీలో మెగా టోర్నీని ఫ్రీగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. టోర్నీలోని అన్ని మ్యాచులను ఐసీసీ మ్యాచ్ సెంటర్‌లో చూడొచ్చు. ఐసీసీ-క్రికెట్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ ద్వారా బంతి బంతికి స్కోర్లను కూడా చెక్ చేసుకోవచ్చు. ఐసీసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా టోర్నీలోని అన్ని మ్యాచులను రేడియో‌లో కూడా ఉచితంగా బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నారు. మన దేశంలో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్ని జియోస్టార్ నెట్‌వర్క్ ప్రసారం చేయనుంది.


9 భాషల్లో..!

డిజిటల్ ప్లాట్‌పామ్‌లో ఏకంగా 9 భాషల్లో చాంపియన్స్ ట్రోఫీ స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, హరియాణ్వీ, బెంగాలీ, భోజ్‌పురి, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో మ్యాచుల్ని చూసేయొచ్చు. జియోస్టార్ యాప్‌లో మెగా టోర్నీ మ్యాచులు స్ట్రీమింగ్ కానున్నాయి. 4 మల్టీ కెమెరాల్లో మ్యాచుల్ని చూసే అవకాశం కల్పిస్తోంది జియో‌స్టార్. టీవీ ఆడియెన్స్ కోసం స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 చానళ్లలో మెగా టోర్నీ మ్యాచుల్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే సంజ్ఞా భాష (Non-Verbal Communication)లో కూడా స్ట్రీమింగ్ చేయనున్నారు.


ఇవీ చదవండి:

ఉప్పల్‌లో 9 వైజాగ్‌లో 2

అబ్బాయిలకు గెలుపు.. అమ్మాయిలకు ఓటమి

గాయాల జాబితా చాంతాడంత!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2025 | 01:29 PM