Share News

Gautam Gambhir: టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం

ABN , Publish Date - Feb 11 , 2025 | 09:22 AM

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్లానింగ్, వ్యూహాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

Gautam Gambhir: టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం
Team India

టెస్టుల్లో వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలపాలైన టీమిండియా.. తనకు అచ్చొచ్చిన వైట్‌బాల్ క్రికెట్‌లో దుమ్మురేపుతోంది. ఇంగ్లండ్‌తో తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న మెన్ ఇన్ బ్లూ.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను పట్టేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి పలువురు బ్యాటర్లు, బౌలర్లు తిరిగి ఫామ్‌ను అందుకోవడంతో మనకు ఢోకా లేదని, చాంపియన్స్ ట్రోఫీ కూడా మనదేనని అభిమానులు అంటున్నారు. అయితే భారత జట్టులో జరుగుతున్న పలు విషయాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


గౌతీ.. ఇదేం ప్లానింగ్!

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్.. ఈ ముగ్గురూ గత కొన్నేళ్లుగా భారత వన్డే జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఒకర్ని మించి ఒకరు పెర్ఫార్మ్ చేస్తున్నారు. గిల్ ఓపెనర్‌గా, అయ్యర్ ఫోర్త్ డౌన్‌లో, రాహుల్ 5వ పొజిషన్‌లో ఆడుతూ వస్తున్నారు. ఆయా పొజిషన్లలో 50కి పైగా యావరేజ్‌తో హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాదుతూ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. కానీ కోచ్ గంభీర్ వ్యవహార శైలితో వీళ్ల కెరీర్‌లే డేంజర్‌లో పడేలా ఉన్నాయి. ముఖ్యంగా రాహుల్‌తో గౌతీ వ్యవహరిస్తున్న తీరు అతడ్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఆటగాళ్లలో అభ్రదతాభావం!

చాంపియన్స్ ట్రోఫీ-2025కి మరో వారం రోజులు కూడా టైమ్ లేదు. ఈ తరుణంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ప్రయోగాల పేరిట తొలి మ్యాచ్‌‌లో గిల్‌ను ఫస్ట్ డౌన్‌లో ఆడించారు. నంబర్ 4లో తిరుగులేని రికార్డు ఉన్న అయ్యర్‌ను అసలు ప్లేయింగ్ ఎలెవన్‌లోకే తీసుకోలేదు. విరాట్ కోహ్లీ మోకాలి గాయం తగ్గకపోవడంతో టీమ్‌లోకి తీసుకుంటున్నామని ముందు రోజు రాత్రి అయ్యర్‌కు సమాచారం ఇచ్చారు. ఇది స్వయంగా శ్రేయస్ బయటపెట్టాడు. అటు నంబర్ 5లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ పేరిట రాహుల్‌ను కాదని అక్షర్ పటేల్‌ను ఆడిస్తున్నారు.


టీమ్‌కే నష్టం: జహీర్ ఖాన్

చాంపియన్స్ ట్రోఫీకి ముందు రాహుల్‌కు తగినంత బ్యాటింగ్ ప్రాక్టీస్, కాన్ఫిడెన్స్ అవసరం. అయినా అతడ్ని ఆఖర్లోనే ఆడిస్తున్నారు. హార్దిక్ పాండ్యాది కూడా ఇదే పరిస్థితి. అసలు బ్యాటింగ్ యూనిట్‌లో ఎవరి ప్లేస్ ఎక్కడో క్లారిటీ లేకపోవడం, ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉంటారనే స్పష్టత లేకపోవడంతో గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇవేం పిచ్చి పనులు అంటూ అతడి మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఆటగాళ్లలో అభద్రతా భావం సృష్టించడం సరికాదని.. వాళ్లకు భరోసా ఇవ్వాలంటూ గంభీర్‌పై ఏకంగా వరల్డ్ కప్ హీరో జహీర్ ఖాన్ సీరియస్ అయ్యాడంటేనే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లేయర్లకు అండగా ఉండకపోతే టీమ్‌కే నష్టమని.. దీనికి భవిష్యత్తులో గౌతీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించాడు జహీర్. మరి.. గంభీర్ తన తప్పులను సరిదిద్దుకుంటాడేమో చూడాలి.


ఇదీ చదవండి:

మూడు రోజుల్లోనే..!

రాణించిన సూర్య, రహానె

క్వార్టర్స్‌లోనే గుకేష్‌ అవుట్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 11 , 2025 | 09:30 AM