Share News

India vs England: ఇంగ్లండ్‌తో రెండో టీ20.. భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో సంచలన మార్పులు

ABN , Publish Date - Jan 24 , 2025 | 07:31 PM

India Playing Eleven: ఇంగ్లండ్‌ను మరోమారు చిత్తు చేసేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. చెన్నైలో ఆ టీమ్ కథ ముగించాలని చూస్తోంది. అందుకోసం బలమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను రెడీ చేస్తోంది.

India vs England: ఇంగ్లండ్‌తో రెండో టీ20.. భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో సంచలన మార్పులు
IND vs ENG

కొత్త ఏడాదిలో వైట్ బాల్‌ క్రికెట్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది టీమిండియా. ఇంగ్లండ్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో బంపర్ విక్టరీ కొట్టింది. 7 వికెట్ల భారీ తేడాతో ఇంగ్లీష్ టీమ్‌ను చిత్తు చేసింది. బౌలింగ్‌లో యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ అదరగొట్టారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో రిజల్ట్‌ను వన్ సైడ్ చేసేశాడు. ఇదే ఊపులో రెండో టీ20లో కూడా ఘనవిజయం సాధించాలని చూస్తోంది మెన్ ఇన్ బ్లూ. ఈ నేపథ్యంలో సూర్య సేన ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..


ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు!

భారత్-ఇంగ్లండ్ మధ్య జనవరి 25, శనివారం నాడు రెండో టీ20 జరగనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే ఈ శాటర్ డే ఫైట్‌ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఆడిన వారినే దాదాపుగా భారత జట్టు మేనేజ్‌మెంట్ కంటిన్యూ చేస్తోందని తెలుస్తోంది. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో 2 కీలక మార్పులు తథ్యంగా కనిపిస్తోంది. ఆ ఇద్దరూ బౌలర్లే అని తెలుస్తోంది. ఫస్ట్ మ్యాచ్ హీరో అభిషేక్ శర్మ, సీనియర్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేస్తారు. సంజూ కీపింగ్ బాధ్యతలు కూడా చూసుకుంటాడు. ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సెకండ్ డౌన్‌లో హైదరాబాదీ తిలక్ వర్మ వస్తారు.


షమి రాక!

మిడిలార్డర్ బాధ్యతల్ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పించ్ హిట్టర్ రింకూ సింగ్ చూసుకుంటారు. వాళ్లకు తోడుగా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. స్పిన్ పిచ్ కాబట్టి తెలుగు తేజం నితీష్ రెడ్డికి బదులు లోకల్ బాయ్ సుందర్‌ను రీప్లేస్ చేసే చాన్సులు ఉన్నాయి. మరో స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఎలాగూ టీమ్‌లో ఉంటాడు. ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడు. తొలి మ్యాచ్‌లో రాణించిన అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు మరో పేసర్‌గా మహ్మద్ షమి రాక ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ స్థానంలో షమీని టీమ్‌లోకి తీసుకోవడం పక్కా అని అర్థమవుతోంది.

భారత జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి.


ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి రాక్షసుడి రీఎంట్రీ

చెప్పి చేయాలా.. పంత్ సీరియస్

టీమిండియాకు ఘోర అవమానం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 24 , 2025 | 07:31 PM