Share News

Rohit Sharma: రోహిత్ గ్లౌవ్స్‌పై ఇంగ్లీష్ లెటర్స్.. కొత్త సెంటిమెంట్‌తో మంటలే

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:40 PM

Today IPL Match 2025: ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కొత్త సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్నాడు. మరి.. ఏంటా సెంటిమెంట్.. అందులోని స్పెషాలిటీ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: రోహిత్ గ్లౌవ్స్‌పై ఇంగ్లీష్ లెటర్స్.. కొత్త సెంటిమెంట్‌తో మంటలే
Rohit Sharma

క్రికెటర్లకు ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. మ్యాచుల్లో రాణించాలనే ఉద్దేశంతో తమ నమ్మకాలను ఫాలో అవుతుంటారు స్టార్లు. కిట్ బ్యాగ్స్‌లో దేవుడి ఫొటోలు పెట్టుకోవడం, జేబులో రుమాలు ఉంచుకోవడం, శరీరంపై ఇష్టదైవం లేదా ఫేవరెట్ కొటేషన్స్ టాటూలుగా వేయించుకోవడం లాంటివి చేస్తుంటారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ కొత్త సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నాడు. అతడి గ్లౌవ్స్‌పై కొన్ని ఇంగ్లీష్ లెటర్స్‌ను డిజైన్ చేయించుకున్నాడు. మరి.. ఐపీఎల్‌కు ముందు హిట్‌మ్యాన్ ఫాలో అవుతున్న నయా సెంటిమెంట్ ఏంటి.. ఆ అక్షరాలను అతడు ఎందుకు డిజైన్ చేయించాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..


అర్థం ఇదే..

ఐపీఎల్ వేళ ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో రీసెంట్‌గా జాయిన్ అయ్యాడు రోహిత్. బ్యాట్ పట్టి జోరుగా సాధన చేస్తూ కనిపించాడు. ఈ టైమ్‌లో అతడి గ్లౌవ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎందుకంటే దానిపై ఎస్‌ఏఆర్ (SAR) అని ఆంగ్లంలో రాసి ఉండటమే. దీన్ని చూసిన అభిమానులు అర్థం ఏమై ఉంటుందా అని ఆలోచనల్లో పడ్డారు. అయితే ఈ వర్డ్స్‌కు మీనింగ్ తన ఫ్యామిలీనే అని ఫ్యాన్స్ అంటున్నారు. రోహిత్-రితికా సజ్దే దంపతుల కుమార్తె పేరు సమైరా. ఆమె పేరులోని తొలి అక్షరమైన ఎస్‌ను ముందు పెట్టాడని అభిమానులు చెబుతున్నారు. కొడుకు అర్జున్ పేరులోని ఫస్ట్ లెటర్ ఏ.. భార్య రితికా నుంచి ఆర్.. ఇలా ఒక్కో అక్షరాన్ని చేరుస్తూ.. ఎస్‌ఏఆర్‌గా గ్లౌవ్స్‌పై డిజైన్ చేయించాడని అంటున్నారు. ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమను ఇలా చూపిస్తున్నాడని చెబుతున్నారు. కొత్త సెంటిమెంట్‌తో ప్రత్యర్థులకు చుక్కలేనని.. హిట్‌మ్యాన్ తాండవం గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఎవరికి నష్టం

ఐపీఎల్ మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్ అందులోనే..

ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్.. ఆర్సీబీదే పైచేయా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2025 | 04:45 PM