Share News

Hardik Pandya: జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. అసలు నిజం ఇదే..

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:27 PM

Janhvi Kapoor: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస విజయాలతో జోష్‌లో ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఆమె క్రేజ్, పాపులారిటీని మరింత పెంచింది. ఇదే ఊపులో మరిన్ని విక్టరీలు కొట్టాలని చూస్తోంది. ఈ తరుణంలో ఓ స్టార్ క్రికెటర్‌తో ఆమె ప్రేమలో పడినట్లు పుకార్లు వస్తున్నాయి.

Hardik Pandya: జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. అసలు నిజం ఇదే..
Hardik Pandya

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. భారత వన్డే, టెస్ట్ జట్టులోకి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. నేషనల్ డ్యూటీ లేకపోవడంతో గత కొన్నాళ్లుగా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు పాండ్యా. వన్డేల్లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే బ్యాటింగ్‌తో పాటు 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేయాలంటూ సెలెక్టర్లు కండీషన్ వేయడంతో ఆ దిశగా ఇంప్రూవ్ అవుతున్నాడు. ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీల్లో అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రఫ్ఫాడించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌తో అతడు డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.


నిజం ఏంటంటే..

జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని.. వాళ్లిద్దరూ ఈ మధ్యే మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో జాన్వీ-పాండ్యా సముద్ర తీరంలో విహరిస్తూ, సన్నిహితంగా కనిపించడంతో చాలా మంది నెటిజన్స్ ఇది నిజమేనని అనుకున్నారు. అయితే దీనిపై నేషనల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా ఫేక్ అని తేలింది. ఈ ఫొటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ చేసినవి అని బయటపడింది. దీంతో డేటింగ్ వార్తలు ఒట్టి పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది.


ఇద్దరూ బిజీ!

జాన్వీకి ఇంకా పెళ్లి కాని విషయం తెలిసిందే. ఆమె వరుస సినిమాలు చేస్తూ మరింత బిజీ అవుతోంది. ‘దేవర’ తర్వాత తెలుగులో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సరసన క్రేజీ ప్రాజెక్ట్‌లో శ్రీదేవి కూతురు నటిస్తోంది. ‘ఆర్సీ 16’గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ పనులు జోరందుకున్నాయి. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా వరుస క్రికెట్‌తో బిజీగా ఉన్నాడు. భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులతో ఆ మధ్య బాగా వార్తల్లో నలిగాడు పాండ్యా. ఐపీఎల్-2024 సమయంలో కెప్టెన్సీ కాంట్రవర్సీ, భార్యతో విడాకులు.. ఇలా వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాడు. అయితే టీ20 వరల్డ్ కప్ విజయంతో హార్దిక్ వాటన్నింటినీ అధిగమించి అందరి మనసులు గెలుచుకున్నాడు. తిరిగి పాజిటివిటీ వైపు నడుస్తూ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాడు.


ఇవీ చదవండి:

6 మ్యాచుల్లో 5 సెంచరీలు.. ఆర్సీబీ బ్యాటర్ కొత్త చరిత్ర

కొడుకు బౌలింగ్.. తండ్రి క్యాచింగ్.. క్రికెట్‌ హిస్టరీలో ఎప్పుడూ చూడని సీన్

వాళ్ల రుణం తీర్చుకుంటా.. అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2025 | 01:34 PM