KER vs GUJ: రంజీ ట్రోఫీలో కేరళ సంచలనం.. 68 ఏళ్లలో ఇదే తొలిసారి
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:00 PM
Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. గెలుపునకు ముంగిట గుజరాత్ బోల్తా పడింది. అయితే కేరళ గెలిచిన తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.

రంజీ ట్రోఫీ 2024-25లో కేరళ సంచలనం సృష్టించింది. 68 ఏళ్లలో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది కేరళ. ఫేవరెట్లలో ఒకటైన గుజరాత్ టీమ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కేరళ 2 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించి ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేరళ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 457 పరుగలు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 455 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కేరళ 4 వికెట్లకు 114 పరుగులు చేసింది.
హిస్టరీలో ఫస్ట్ టైమ్!
కేరళ-గుజరాత్ మ్యాచ్‌లో రిజల్ట్ రావడం అసాధ్యంగా మారడంతో రూల్స్ కీలకంగా మారాయి. రంజీల్లో మ్యాచ్ డ్రాగా ముగిసిన పక్షంలో మొదటి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన టీమ్‌ను విన్నర్‌గా అనౌన్స్ చేస్తారు. తాజా మ్యాచ్‌లో ఫలితం కష్టమవడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 2 పరుగులతో ఆధిక్యంలో ఉన్న కేరళను విజేతగా ప్రకటించారు. 68 ఏళ్ల కింద రంజీల్లో ఎంట్రీ ఇచ్చిన కేరళ జట్టు.. టోర్నీ తుదిపోరుకు అర్హత సాధించడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పాలి. రంజీ ట్రోఫీ హిస్టరీలో ఒక జట్టు 2 పరుగుల స్వల్ప తేడాతో ఫైనల్‌కు చేరుకోవడం కూడా ఇదే మొదటిసారి. అలా ఎన్నో ఊహకందని ఫీట్లకు ఈ మ్యాచ్ వేదికగా నిలిచింది. మరోవైపు రెండో సెమీస్‌లో ముంబైకి షాకిచ్చిన విదర్భ.. ఫైనల్స్‌లో కేరళతో అమీతుమీ తేల్చుకోనుంది. మరి.. ఈ రెండు జట్లలో ఎవరు చాంపియన్‌గా నిలుస్తారో చూడాలి.
ఇవీ చదవండి:
కేఎల్ రాహుల్‌కు అరుదైన అవార్డు
రాహుల్ వల్ల తిట్లు తింటున్న హార్దిక్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి