Share News

Kuldeep Yadav: ఆర్సీబీపై కుల్దీప్ సెటైర్.. అంత మాట అనేశాడేంటి

ABN , Publish Date - Jan 25 , 2025 | 03:00 PM

IPL 2025: ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ప్రతిసారి ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం, ఒట్టి చేతులతో వెళ్లడం ఆ టీమ్‌కు రివాజుగా మారింది.

Kuldeep Yadav: ఆర్సీబీపై కుల్దీప్ సెటైర్.. అంత మాట అనేశాడేంటి
Kuldeep Yadav

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ పాపులర్ టీమ్స్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఒక్కసారి కూడా కప్పు కొట్టకపోయినా స్టార్ల బలంతో ఆ టీమ్ తన క్రేజ్‌ను ఏటికేడు మరింత పెంచుకుంటూ వస్తోంది. విరాట్ కోహ్లీతో పాటు చాలా మంది స్టార్లు ఆడుతుండటంతో ప్రతిసారి ఆర్సీబీపై భారీ అంచనాలు ఏర్పడతాయి. కానీ వాటిని నిలబెట్టుకోలేకపోతోందా టీమ్. కప్పు కొట్టడంలో విఫలమవుతుండటంతో బెంగళూరుపై ట్రోల్స్ రావడం కామన్ అయిపోయింది. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా కోహ్లీ టీమ్‌ను ట్రోల్ చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..


ఊహించని ఆన్సర్!

ఫుట్‌బాల్ అంటే కుల్దీప్‌కు చాలా ఇష్టం. ఆ ఆటలోని లీగ్స్‌ను అతడు బాగా ఫాలో అవుతుంటాడు. ముఖ్యంగా ఎఫ్‌సీ బార్సిలోనా క్లబ్‌‌ అంటే అతడికి పిచ్చి. ఈ విషయాన్ని అతడు పలుమార్లు షేర్ కూడా చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌ పాడ్‌కాస్ట్‌లో మరోమారు ఫుట్‌బాల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు కుల్దీప్. ఇదే క్రమంలో చాట్ సెక్షన్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చాడు. అయితే ఓ ఆర్సీబీ ఫ్యాన్ వేసిన క్వశ్చన్‌కు భారత స్టార్ ఊహించని రీతిలో ఆన్సర్ ఇచ్చాడు. బెంగళూరుకు ట్రోఫీ కావాలంటూ సెటైర్ వేశాడు కుల్దీప్.


నువ్వు గెలిచావా?

ఆర్సీబీకి వచ్చేయ్.. మాకో గోల్ కీపర్ కావాలంటూ కుల్దీప్‌ను ఒక ఫ్యాన్ అడిగాడు. దీనికి స్టార్ స్పిన్నర్ ‘మీకు గోల్ కీపర్ కాదు.. ట్రోఫీ అవసరం ఉంది. గోల్‌ కీపర్‌ను ఏం చేసుకుంటారు?’ అంటూ జోక్ వేశాడు కుల్దీప్. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదనే విషయాన్ని కుల్దీప్ అన్నాడని.. కోహ్లీ టీమ్ పరువు తీశాడనే కామెంట్స్ వస్తున్నాయి. ట్రోఫీ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆర్సీబీ ఫ్యాన్స్‌ను అతడు హర్ట్ చేశాడని అంటున్నారు. అంత మాట ఎలా అంటాడని అతడిపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. అయితే దీనిపై కుల్దీప్ ట్విట్టర్‌లో స్పందించాడు. ‘ఆర్సీబీ ఫ్యాన్స్ చిల్ అవ్వండి. ఈసారి ట్రోఫీ మనదే. కానీ నేను మాత్రం గోల్ కీపర్‌ను కాదు’ అని ట్వీట్ చేశాడు. అయితే పదే పదే ట్రోఫీ ప్రస్తావన తీసుకురావడంతో కుల్దీప్ మీద కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో నువ్వు ఒక్కసారైనా ఐపీఎల్ ట్రోఫీని గెలిచావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.


ఇవీ చదవండి:

నేను రోహిత్‌లా కాదు.. ఆ పని చేయను: సూర్యకుమార్

రెండో టీ20కి ముందు భారత్‌కు బిగ్ షాక్

ఖేలో ఇండియా గేమ్స్‌లో నయనకు స్వర్ణం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 25 , 2025 | 03:05 PM