Mohammed Shami: షమి క్రేజీ రికార్డ్.. ఐసీసీ టోర్నీల్లో ఎవరికీ సాధ్యం కాని ఫీట్
ABN , Publish Date - Feb 20 , 2025 | 06:47 PM
Champions Trophy 2025: భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమి క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో ఏ టీమిండియా బౌలర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను అతడు అందుకున్నాడు.

‘ఏదైనా తాను దిగనంత వరకే.. వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్’ అనే బాలయ్య డైలాగ్‌ను నిజం చేసి చూపించాడు భారత ఏస్ పేసర్ మహ్మద్ షమి. గాయం కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరంగా ఉన్న ఈ స్పీడ్‌స్టర్.. రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చిన షమి.. అక్కడ మెరుపులు మెరిపించాడు. తనలో పస తగ్గలేదని ప్రూవ్ చేశాడు. ఇక అచ్చొచ్చిన ఐసీసీ ఈవెంట్‌లో అతడు చెలరేగిపోయాడు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో 5 వికెట్లతో తుఫాన్ సృష్టించాడు షమి. ఈ క్రమంలో 4 పాత రికార్డులకు అతడు పాతర వేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
రికార్డుల ఊచకోత
బంగ్లాతో మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు షమి. దీంతో వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే ఐసీసీ ఈవెంట్స్‌లో అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన టీమిండియా బౌలర్‌గా నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఫైఫర్ సాధించిన తొలి భారత బౌలర్‌గానూ అతడు రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐసీసీ వైట్‌బాల్ ఈవెంట్స్‌లో మెన్ ఇన్ బ్లూ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గానూ చరిత్ర సృష్టించాడు షమి. ఇలా ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు అరుదైన ఘనతలు అందుకొని వారెవ్వా అనిపించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన రోహిత్ సేన ప్రస్తుతం 0.3 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 5 పరుగులతో ఉంది.
ఇవీ చదవండి:
బంగ్లా బ్యాటర్ సెంచరీ.. మనోడు కాకున్న మెచ్చుకోవాల్సిందే
అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్
సారీ చెప్పిన రోహిత్.. చేతులు జోడించి..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి