Rohit-Siraj: ప్లీజ్.. రోహిత్‌ను ఏమీ అనొద్దు.. సీటీ కాంట్రవర్సీపై సిరాజ్ రియాక్షన్
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:48 AM
IPL 2025: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఎట్టకేలకు ఓ కాంట్రవర్సీపై రియాక్ట్ అయ్యాడు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ తప్పేమీ లేదన్నాడు. ఇంకా సిరాజ్ ఏమన్నాడంటే..

దేశం తరఫున ఆడాలనేది ఏ క్రికెటర్‌కైనా బిగ్ డ్రీమ్. ఆ తర్వాత వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఆడాలి, టీమ్‌కు కప్ అందించాలనేది చాలా మంది ఆటగాళ్ల కల. కానీ ఒక్కోసారి ఎంత బాగా ఆడినా మెగా టోర్నమెంట్స్‌కు వెళ్లే స్క్వాడ్స్‌లో చోటు దక్కదు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ విషయంలో దాదాపుగా అదే జరిగింది. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో అతడికి చోటు గ్యారెంటీ అనుకుంటే.. ఆఖరుకు సిరాజ్‌కు ప్లేస్ దక్కలేదు. ఇది అప్పట్లో వివాదాస్పదంగా మారింది. దీనిపై తాజాగా రియాక్ట్ అయ్యాడు మియా మ్యాజిక్. అతడు ఏమన్నాడంటే..
కారణం అదే..
సిరాజ్‌ను టీమ్‌లోకి తీసుకోకపోవడంతో సారథి రోహిత్ శర్మ తప్పు చేశాడంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా సిరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ప్లీజ్.. రోహిత్‌ను ఏమీ అనొద్దని చెప్పాడు. అతడు కరెక్ట్ పని చేశాడని తెలిపాడు. దుబాయ్ పిచ్‌లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయమని.. అందుకే తనను టీమ్‌లోకి తీసుకోలేదని స్పష్టం చేశాడు సిరాజ్. టీమిండియాకు ఏది మంచిదో రోహిత్ అదే చేస్తాడని.. దుబాయ్ పిచ్‌లపై ఫాస్ట్ బౌలర్లకు అంతగా హెల్ప్ ఉండదని తెలిసే తనను సెలెక్ట్ చేయలేదన్నాడు.
ఆ డెసిషన్ కరెక్ట్
నేషనల్ టీమ్‌కు ఆడినప్పుడు వచ్చే కిక్కే వేరని సిరాజ్ అన్నాడు. అది తమ ఆత్మస్థైర్యం, నమ్మకాన్ని పెంచుతుందన్నాడు. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా ఐసీసీ టోర్నీల్లో ఆడాలని తానూ అనుకుంటానని తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీకి తనను సెలెక్ట్ చేయలేదనే విషయం తెలిసి మొదట్లో జీర్ణించుకోలేకపోయానని వ్యాఖ్యానించాడు సిరాజ్. అయితే టీమ్ బాగు కోసం ఏ నిర్ణయం సరైనదో.. రోహిత్ భాయ్ అదే తీసుకుంటాడని పేర్కొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ టైమ్‌లో దొరికిన బ్రేక్‌లో ఫిట్‌నెస్, బౌలింగ్ మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెట్టానన్నాడు సిరాజ్. ఏదేమైనా సీటీ-2025 ట్రోఫీని భారత్ గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.
ఇవీ చదవండి:
అయ్యర్‌నే పొగుడుతున్నారు.. గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు
కావాలనే సెంచరీ మిస్.. అయ్యర్‌కు హ్యాట్సాఫ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి