Share News

N Jagadeesan: ఒకే ఓవర్‌లో 7 బౌండరీలు.. బాదుడుకు కేరాఫ్ అడ్రస్

ABN , Publish Date - Jan 09 , 2025 | 03:55 PM

N Jagadeesan: ఒకే ఓవర్‌లో మూడ్నాలుగు ఫోర్లు కొట్టడం కామనే. 6 బంతుల్లో 6 బౌండరీలు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక బ్యాటర్ మాత్రం సింగిల్ ఓవర్‌లో ఏకంగా 7 ఫోర్లు బాదేశాడు. ఎవరా ఆటగాడు అనేది ఇప్పుడు చూద్దాం..

N Jagadeesan: ఒకే ఓవర్‌లో 7 బౌండరీలు.. బాదుడుకు కేరాఫ్ అడ్రస్
N Jagadeesan

ఒకే ఓవర్‌లో మూడ్నాలుగు ఫోర్లు కొట్టడం కామనే. 6 బంతుల్లో 6 బౌండరీలు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక బ్యాటర్ మాత్రం సింగిల్ ఓవర్‌లో ఏకంగా 7 ఫోర్లు బాదేశాడు. బౌలర్ బెండు తీశాడు. బౌలర్ అమాంతం బౌండరీ నుంచి పరిగెత్తుకురావడం, బంతులు వేయడం.. బ్యాటర్ బుల్లెట్ పేస్‌తో దాన్ని మళ్లీ బౌండరీ లైన్‌కు పంపడం.. ఆ ఓవర్ మొత్తం ఇదే తంతు. ఎక్కడ వేసినా, ఎంత వేగంతో వేసినా, లైన్ అండ్ లెంగ్త్ మార్చినా పిచ్ మీద పడిన వెంటనే దాన్ని ఫోర్ లైన్‌కు పంపిస్తూ ఆశ్చర్యపరిచాడా బ్యాట్స్‌మన్. మరి.. ఎవరా ఆటగాడు? ఏ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది? అనేది ఇప్పుడు చూద్దాం..


వాటే ఫీట్!

విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతం చోటుచేసుకుంది. తమిళనాడు-రాజస్థాన్ మధ్య జరుగుతున్న ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింగిల్ ఓవర్‌లో ఏకంగా 7 బౌండరీలు నమోదయ్యాయి. తమిళనాడు ఇన్నింగ్స్ సమయంలో అమన్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో తొలి బంతి వైడ్‌గా వేయగా అది బౌండరీ వెళ్లింది. ఆ తర్వాతి 6 బంతులను ఫోర్లుగా మలిచాడు తమిళనాడు బ్యాటర్ ఎన్ జగదీశన్. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలించాడు. గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. వాటే బ్యాటింగ్ అంటూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 267 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌ మొదలుపెట్టిన తమిళనాడు ఇప్పుడు 32 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 167 పరుగులతో ఉంది. జగదీశన్ 52 బంతుల్లో 65 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.


ఇవీ చదవండి:

బుమ్రా ఇంజ్యురీపై అప్‌డేట్.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా..

నాకు అక్కర్లేదు.. డివోర్స్ రూమర్స్‌పై ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్

ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌పై బ్యాన్.. పంతం పట్టి చేశారుగా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 09 , 2025 | 03:55 PM