Share News

Punjab vs Gujarat: అంతా అయ్యర్‌నే పొగుడుతున్నారు.. గేమ్ చేంజర్‌ను మర్చిపోతే ఎలా..

ABN , Publish Date - Mar 26 , 2025 | 10:28 AM

Indian Premier League: ఐపీఎల్ నయా ఎడిషన్‌ను విజయంతో ఆరంభించింది పంజాబ్ కింగ్స్. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అయ్యర్ సేన.. స్టార్లతో పాటు కుర్రాళ్లు కూడా రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

Punjab vs Gujarat: అంతా అయ్యర్‌నే పొగుడుతున్నారు.. గేమ్ చేంజర్‌ను మర్చిపోతే ఎలా..
Punjab Kings

టీమ్ నిండా స్టార్లు, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టైలిష్ బ్యాటర్ కెప్టెన్‌గా రావడం, రికీ పాంటింగ్ రూపంలో లెజెండరీ కోచ్‌ కూడా ఉండటంతో ఐపీఎల్ నయా సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్లే కొత్త సీజన్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది అయ్యర్ సేన. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్‌తో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సక్సెస్‌లో ఎక్కువ క్రెడిట్ అయ్యర్‌కే వెళ్లిపోయింది. శ్రేయస్‌కు ఉన్న క్రేజ్‌లో టీమ్‌లోని మరికొందరు గేమ్ చేంజర్స్‌కు క్రెడిట్ దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


వికెట్ తీయకపోయినా..

గుజరాత్‌తో మ్యాచ్‌లో అయ్యర్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు రాణించారు. బ్యాటింగ్‌లో ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) లాంటి కుర్రాళ్లు విలువైన పరుగులు చేశారు. ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (2/36) కీలకమైన బ్రేక్‌త్రూలతో ఆకట్టుకున్నాడు. అయితే వీళ్ల కంటే కూడా ఒక్క వికెట్ కూడా తీయకుండానే పంజాబ్ గెలుపులో కీ రోల్ పోషించాడో యంగ్ పేసర్. అతడే వైశాఖ్ విజయ్ కుమార్. నిన్నటి మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన అతడు.. 28 పరుగులు ఇచ్చి వికెట్ కూడా తీయలేదు. కానీ గేమ్ చేంజింగ్ స్పెల్ అతడే వేశాడు.


క్రెడిట్ ఇవ్వాల్సిందే..

పంజాబ్‌తో మ్యాచ్‌లో ఒకదశలో జీటీదే విజయమని అంతా అనుకున్నారు. 12 ఓవర్లకు 145 పరుగులతో పటిష్టంగా కనిపించింది గిల్ సేన. అయితే పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, పరుగులు ఇవ్వకుండా సతాయించడంతో గుజరాత్‌పై ప్రెజర్ పెరిగింది. రన్ రేట్ పెరిగి చివరకు ఓటమి తప్పలేదు. దీనికి మెయిన్ క్రెడిట్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వైశాఖ్ విజయ్‌కు ఇవ్వాలి. ఇన్నింగ్స్ 15, 17 ఓవర్లు వేసిన ఈ పంజాబ్ పేసర్.. రెండు ఓవర్లలో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వికెట్లు తీయకపోయినా రిక్వైర్డ్ రన్‌రేట్ అమాంతం పెరిగేలా చేశాడు. జీటీ బ్యాటర్లపై ఒత్తిడి పెంచేశాడు. స్టన్నింగ్ యార్కర్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు పిచ్చెక్కించాడు. ఒకవేళ వైశాఖ్ గనుక రన్స్ లీక్ చేసినా.. డెత్‌ ఓవర్స్‌లో కట్టడి చేయకపోయినా అయ్యర్ టీమ్‌ డేంజర్‌లో పడేది. విన్నింగ్ మార్జిన్ 11 రన్స్ కాబట్టి వైశాఖ్ స్పెల్ గేమ్ చేంజింగ్ అనే చెప్పాలి.


ఇవీ చదవండి:

కావాలనే సెంచరీ మిస్.. అయ్యర్‌కు హ్యాట్సాఫ్

క్రేజీ స్టేడియం కూల్చివేత

ఒక్క గోల్‌ కూడా లేకుండానే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 26 , 2025 | 10:36 AM