Rishabh Pant LSG vs DC 2025: అశుతోష్ కాదు.. ఆ రాక్షసుడి వల్లే ఓడాం: పంత్
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:10 PM
Indian Premier League: ఐపీఎల్ కొత్త సీజన్‌ను నిరాశగా స్టార్ట్ చేసింది లక్నో సూపర్ జియాంట్స్. కొత్త సారథి రిషబ్ పంత్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఎల్ఎస్‌జీ.. తొలి మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో ఓటమి పాలైంది.

పొట్టి క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్క ఓవర్‌లోనే మ్యాచ్ స్వరూపం మారిపోతూ ఉంటుంది. ఓ వికెట్ లేదా ఒక బౌండరీ.. ఫలితాన్ని మార్చేస్తుంది. అందుకే టీ20ల్లో ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఆ సమయంలో బెస్ట్ ఇచ్చిన టీమ్‌దే విజయం. ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జియాంట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే ప్రూవ్ అయింది. తమదే గెలుపు అనుకున్న ఢిల్లీ.. 1 వికెట్ తేడాతో పరాజయం పాలైంది. తృటిలో మ్యాచ్ చేజారడంపై ఆ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్ రియాక్ట్ అయ్యాడు. అంతా అతడే చేశాడని చెప్పాడు.
మ్యాచ్‌ను లాక్కున్నాడు
అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్) అద్భుతంగా ఆడాడని పంత్ మెచ్చుకున్నాడు. అయితే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది, తమ నుంచి విజయాన్ని లాక్కెళ్లింది మాత్రం యంగ్ బ్యాటర్ విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39) అంటూ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఆ రాక్షసుడే తమ ఓటమికి కారణమన్నాడు. అతడు తనకు ఇచ్చిన పనిని సమర్థంగా నిర్వర్తించాడని.. తమ చేతుల్లోని మ్యాచ్‌ను తీసుకొని వెళ్లిపోయాడని పంత్ చెప్పుకొచ్చాడు. డీసీ టీమ్ పార్ట్‌నర్‌షిప్స్ నెలకొల్పడంతో సక్సెస్ అందుకుందన్నాడు.
సేఫ్ అనుకున్నాం.. కానీ..
ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 34), అశుతోష్, విప్రాజ్ బాగా ఆడటమే గాక మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారని మెచ్చుకున్నాడు పంత్. లక్నో జట్టులోని టాపార్డర్ బ్యాటర్లు కూడా అదరగొట్టాడని తెలిపాడు. ఈ వికెట్ మీద ఈ స్కోరు సేఫ్ అని భావించామని చెప్పుకొచ్చాడు. ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒక మంచి విషయం నేర్చుకుంటూ ముందుకెళ్తామని వివరించాడు పంత్. ఆరంభంలోనే వికెట్ పడినా.. మిచెల్ మార్ష్ (72), నికోలస్ పూరన్ (75) సూపర్బ్‌గా బ్యాటింగ్ చేశారని మెచ్చుకున్నాడు పంత్. ఆటలో గెలుపోటములు సహజమని.. ప్రతి మ్యాచ్ నుంచి సాధ్యమైనన్ని మంచి విషయాలు తీసుకొని తదుపరి జరిగే మ్యాచులపై ఫోకస్ పెడతామన్నారు.
ఇవీ చదవండి:
పంత్ వర్సెస్ లక్నో ఓనర్.. ఏం జరిగిందంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి