Share News

Rohit Sharma: చరిత్ర తిరగరాసిన రోహిత్.. లెజెండ్స్ సరసన హిట్‌మ్యాన్

ABN , Publish Date - Feb 20 , 2025 | 08:21 PM

IND vs BAN: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. లెజెండ్స్ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు. మరి.. హిట్‌మ్యాన్ సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: చరిత్ర తిరగరాసిన రోహిత్.. లెజెండ్స్ సరసన హిట్‌మ్యాన్
Rohit Sharma

భారత సారథి రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో అతడు 11 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటికే ఈ క్లబ్‌లో ఉన్న దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీతో పాటు సహచరుడు విరాట్ కోహ్లీ సరసన రోహిత్ స్థానం దక్కించుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఇది మర్చిపోలేని రికార్డు అనే చెప్పాలి.


కోహ్లీ తర్వాత రోహితే!

11 వేల పరుగుల మార్క్‌ను వేగంగా అందుకున్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్‌లు) ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడి తర్వాతి స్థానంలో రోహిత్ (261 ఇన్నింగ్స్‌లు) కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (276 ఇన్నింగ్స్‌లు), రికీ పాంటింగ్ (286 ఇన్నింగ్స్‌లు), సౌరవ్ గంగూలీ (288 ఇన్నింగ్స్‌లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, బంగ్లాతో మ్యాచ్ విషయానికొస్తే.. 228 పరుగుల ఛేదనలో భారత్ ప్రస్తుతం 23 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 112 పరుగులతో ఉంది. శుబ్‌మన్ గిల్ (47 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. గెలుపునకు 27 ఓవర్లలో మరో 117 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నందున రోహిత్ సేన టార్గెట్‌ను చేజ్ చేయడం ఈజీ అనే చెప్పాలి. మరి.. బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి.


ఇవీ చదవండి:

షమి తుఫాను.. 4 రికార్డులు బ్రేక్

బంగ్లా బ్యాటర్ సెంచరీ.. మనోడు కాకున్నా మెచ్చుకోవాల్సిందే

అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2025 | 08:25 PM