Share News

IND vs ENG: గెలిచారు సరే.. ఆ ముగ్గురి సంగతేంటి

ABN , Publish Date - Feb 07 , 2025 | 02:40 PM

Team India: వైట్‌బాల్ క్రికెట్‌లో భారత జట్టు రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.

IND vs ENG: గెలిచారు సరే.. ఆ ముగ్గురి సంగతేంటి
Team India

రెడ్ బాల్ క్రికెట్‌లో తడబడుతున్న భారత్.. వైట్‌బాల్ సిరీస్‌ల్లో మాత్రం రప్పా రప్పా అంటూ దూసుకెళ్తోంది. ఎదురొచ్చిన టీమ్‌ను తొక్కిపడేస్తూ పరుగులు తీస్తోంది. 5 టీ20ల సిరీస్‌లో 4-1తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. వన్డే సిరీస్‌లోనూ గ్రాండ్‌గా బోణీ కొట్టింది. నాగ్‌పూర్ వేదికగా బట్లర్ సేనతో గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి సంధించిన 248 పరుగుల లక్ష్యాన్ని మరో 68 బంతులు ఉండగానే చేజ్ చేసేసింది. ఈ మ్యాచ్ గెలుపుతో భారత్‌కు చాలా ప్లస్‌లతో పాటు కొన్ని మిస్టేక్స్ కూడా కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..


ఈ ప్రశ్నలకు జవాబేది?

నాగ్‌పూర్ వన్డేలో బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. అక్షర్ పటేల్ (1/38) కూడా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) సూపర్బ్ నాక్స్‌తో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశారు. సారథిగా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ, వ్యూహాలను పక్కాగా అమలుపరుస్తూ రోహిత్ మంచి మార్కులు వేయించుకున్నాడు. అయితే మూడు విషయాల్లో మాత్రం జట్టు బలహీనంగా కనిపిస్తోంది. అందులో కీలకమైనది సీనియర్ల ఫామ్. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. వీరిలో హిట్‌మ్యాన్ తొలి వన్డేలో ఆడగా.. మోకాలి గాయం కారణంగా విరాట్ బరిలోకి దిగలేదు. రోహిత్ 2 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.


కోహ్లీ టెన్షన్

టెస్టుల్లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడిన రోహిత్.. రంజీల్లో ఆడినా అక్కడ పెద్దగా ఆకట్టుకోలేదు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడు ఫామ్‌లోకి రావడం టీమ్‌కు చాలా కీలకం. హిట్‌మ్యాన్ చెలరేగి ఆడితే మిగతా ఆటగాళ్లలోనూ రాణించాలనే తపన, భయం రెండూ మొదలవుతాయి. అందకే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడు అదరగొడతాడని అంతా ఆశించారు. కానీ తొలి మ్యాచ్‌లో రోహిత్ తుస్సుమన్నాడు. అటు చూస్తే కోహ్లీ గాయంతో బాధపడుతున్నాడు. అతడు ఎప్పటికల్లా రికవర్ అవుతాడో క్లారిటీ లేదు. ఒకవేళ కమ్‌బ్యాక్ ఇచ్చినా ఫామ్‌ను అందుకుంటాడా? లేదా? అనేది మరో ప్రశ్న.


లాస్ట్ చాన్స్!

నాగ్‌పూర్ వన్డేలో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫెయిల్ అయ్యాడు. ఆడుతూ పాడుతూ మ్యాచ్‌ను ఫినిష్ చేయాల్సినోడు.. అనవసర ప్రెజర్ తీసుకొని ఔట్ అయ్యాడు. మిడిలార్డర్‌లో అందునా 5వ పొజిషన్‌‌లో అదరగొట్టే రాహుల్‌ పొజిషన్‌ను మార్చడం వల్లే ఇలా జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సిరీస్ ముగిసేకల్లా ఈ ముగ్గురు సీనియర్లు ఫామ్ అందుకోవడం, బ్యాటింగ్ ఆర్డర్ సెట్ అవడం, బౌలింగ్‌లో ప్రయోగాలు చేయడం చాలా కీలకం. ఏదైనా తేడా కొడితే చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సేనకు తిప్పలు తప్పవు. అందుకే వీటిని హిట్‌మ్యాన్, కోచ్ గంభీర్ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..

ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి

‘సన్‌రైజర్స్‌’బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్‌ విధానం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2025 | 03:21 PM

News Hub