Share News

Sydney Test: మరీ ఇంత ఘోరమా.. టీమిండియా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 03 , 2025 | 05:33 PM

టీమిండియాలోని ఎంతో మంది యంగ్‌స్టర్స్‌కు లైఫ్ ఇచ్చి సపోర్ట్‌గా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను జట్టులో నుంచి తీసేశారు. సిడ్నీ టెస్ట్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడికి చోటు దక్కలేదు.

Sydney Test: మరీ ఇంత ఘోరమా.. టీమిండియా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Gautam Gambhir

IND vs AUS: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో అతడు ఆడలేదు. హిట్‌మ్యాన్ స్థానంలో శుబ్‌మన్ గిల్ బరిలోకి దిగాడు. మ్యాచ్‌కు ముందు రోజు వరకు రోహిత్‌ను ఈ టెస్ట్‌లో ఆడించరంటూ సోషల్ మీడియాలో జోరుగా కథనాలు వచ్చాయి. వరుస ఓటములు, పేలవ ఫామ్‌తో బాధపడుతున్న రోహిత్‌‌ను పక్కనబెట్టడం ఖాయమని వినిపించింది. అదే నిజమైంది. అయితే హిట్‌మ్యాన్ తనంతట తాను పక్కన జరిగాడా? అతడ్ని తీసేశారా? అనేది క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.


రాంగ్ సిగ్నల్స్!

హెడ్ కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ రోహిత్‌ను తీవ్రంగా అవమానించిందని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు అన్నాడు. హిట్‌మ్యాన్ లాంటి చాంపియన్ ప్లేయర్‌ను బెంచ్ మీద కూర్చోబెట్టడం ఏంటి? మరీ ఇంత దారుణమా? అని అతడు విస్మయం వ్యక్తం చేశాడు. ఇంతకంటే ఘోరం ఉండదన్నాడు. టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న ఆటగాడ్ని ఆడించకపోవడం కంటే పెద్ద తప్పు ఏదీ లేదన్నాడు సిద్ధు. ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తోందంటూ గంభీర్‌పై విరుచుకుపడ్డాడు. రోహిత్‌కు రెస్పెక్ట్ ఇవ్వాలని.. అతడు జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని, ఆషామాషీ ప్లేయర్ కాదన్నాడు సిద్ధు.


ఇంత అవమానమా?

‘టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న ఆటగాడ్ని సిరీస్ మధ్యలో ఇలా తీసేయడం సరికాదు. తనంత తాను పక్కకు జరిగే అవకాశం కూడా ఇవ్వకూడదు. ఇది తప్పుడు సంకేతాలను పంపిస్తోంది. మార్క్ టేలర్, మహ్మద్ అజహరుద్దీన్ లాంటి కెప్టెన్లను చాలా మందిని చూశా. వాళ్లు బ్యాడ్ ఫామ్‌తోనూ ఏడాదికి పైనే టీమ్‌లో కొనసాగారు. రోహిత్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ మరింత నమ్మాల్సింది. అతడికి గౌరవం ఇవ్వాల్సింది. కానీ ఇలా అవమానకరంగా అతడ్ని పక్కకు జరపడం కరెక్ట్ కాదు. భారత క్రికెట్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే ఫస్ట్ టైమ్. ఇంతకంటే బ్లండర్ మిస్టేక్ లేదు’ అంటూ గంభీర్‌పై సీరియస్ అయ్యాడు సిద్ధు.


Also Read:

రోహిత్ కావాలనే అలా చేశాడు.. పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

గంభీర్‌ను నమ్మి మోసపోయిన పంత్.. టీమ్‌లో ప్లేస్ పోతుందనే భయంతో..

బుమ్రాతో పెట్టుకుంటే బుగ్గే.. ఇదీ రివేంజ్ అంటే..

ఒంటి నిండా గాయాలు.. నొప్పి భరిస్తూనే బ్యాటింగ్..

For More Sports And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 05:39 PM