Rohit Sharma: ఎంతో గర్విస్తున్నా.. నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను: రోహిత్
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:58 PM
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన జీవితంలో అది చాలా స్పెషల్ అని అంటున్నాడు. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతున్నాడు. ఎంతో గర్వపడుతున్నానని తెలిపాడు.
Wankhede Stadium: రోహిత్ శర్మ.. దశాబ్దంన్నర కాలం నుంచి టీమిండియాకు ఆడుతున్న ప్లేయర్. ఒక బ్యాటర్‌గా, కెప్టెన్‌గా జట్టుకు విశిష్ట సేవలు అందిస్తున్నాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో తోపు బ్యాటర్‌గా పేరు సంపాదించాడు. అయితే ఓవర్‌నైట్ హిట్‌మ్యాన్ ఈ స్థాయికి చేరుకోలేదు. దీని వెనుక ఏళ్ల శ్రమ, కష్టం, అంకితభావం ఉన్నాయి. ముంబై గల్లీల్లో క్రికెట్ ఆడే స్థాయి నుంచి టీమిండియా కెప్టెన్ రేంజ్‌కు చేరుకున్నాడు రోహిత్. ఇందులో అతడి స్వయంకృషితో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ ఉంది. అక్కడి వాంఖడే స్టేడియంతో అతడికి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే ఆ స్టేడియం తనకు ఎంతో స్పెషల్ అని అంటున్నాడు హిట్‌మ్యాన్.
ఆ జర్నీ అద్భుతం!
జనవరి 19వ తేదీన వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవ సంబురాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అందరికీ హలో. జనవరి 19తో వాంఖడేకు 50 ఏళ్లు నిండుతాయి. ఇది ముంబైకర్లు అందరికీ ఎంతో గర్వపడే విషయం. ముంబై క్రికెట్‌తో ముడిపడి ఉన్నవారికి ఇది ప్రౌడ్ మూమెంట్. ముఖ్యంగా నాకు ఈ గ్రౌండ్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాలి. ఇక్కడ నాకు మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఏజ్ గ్రూప్ క్రికెట్ నుంచి ఇప్పటిదాకా ఈ మైదానంతో నా ప్రయాణం అద్భుతం. నేను ఆడే తొలి రోజుల్లో పాత గ్రౌండ్ ఉండేది. ప్రస్తుత మైదానం భారత క్రికెట్‌కు ఎన్నో మెమరీస్ అందించింది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
స్పెషల్ కనెక్షన్
టీమిండియాతో పాటు ముంబై ఇండియన్స్‌కు కూడా వాంఖడే స్టేడియంతో స్పెషల్ కనెక్షన్ ఉందన్నాడు రోహిత్. ఈ గ్రౌండ్‌లో మరిన్ని అద్భుత మ్యాచ్‌లు జరగాలని.. అందరికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు స్పెషల్ వీడియోలో చెప్పుకొచ్చాడు రోహిత్. కాగా, వాంఖడే 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో అక్కడి స్టాఫ్‌కు ముంబై క్రికెట్ బహుమతులు ప్రకటించింది. ముంబై తరఫున ఆడిన ఆటగాళ్లకు జనవరి 19న జరిగే వేడుకల్లో సన్మానం చేయడంతో పాటు నగదు ప్రోత్సాహకం లాంటివి అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ వీడియోతో వాంఖడే సెలబ్రేషన్స్‌పై అందరి ఫోకస్ నెలకొంది.
ఇవీ చదవండి:
రోహిత్-కోహ్లీపై బ్యాన్.. స్టార్లకు ఉచ్చు బిగిస్తున్న బీసీసీఐ
టీమిండియాలో వణుకు.. డేంజర్ రూల్‌ను మళ్లీ తీసుకొస్తున్న బీసీసీఐ
లగ్జరీ బంగ్లా కొన్న కోహ్లీ-అనుష్క.. కొత్త ఇంటికి అన్ని కోట్లా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి