Share News

Rohit Sharma: నేనేం చేయాలో నాకు తెలుసు.. వాళ్లకు ఇచ్చిపడేసిన రోహిత్

ABN , Publish Date - Feb 11 , 2025 | 10:04 AM

IND vs ENG: ఫామ్ కోల్పోయి విమర్శలపాలైన భారత సారథి రోహిత్ శర్మ తిరిగి పుంజుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో స్టన్నింగ్ సెంచరీతో తన పవర్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు.

Rohit Sharma: నేనేం చేయాలో నాకు తెలుసు.. వాళ్లకు ఇచ్చిపడేసిన రోహిత్
Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. మెరుపు సెంచరీతో తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టాడు. ఏకంగా 7 సిక్సులు బాది మీసం మెలేశాడు. గత కొన్నాళ్లుగా అటు బ్యాటింగ్‌లో ఫెయిల్ అవుతుండటంతో ఇటు సారథ్యం మీదా ప్రభావం పడింది. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు చిరస్మరణీయ శతకంతో తిరిగి గాడిన పడ్డాడు. ఈ నేపథ్యంలో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు.


స్పెషల్ కాదు!

తానేం చేయాలో తనకు తెలుసునంటూ విమర్శకులపై ఇన్‌డైరెక్ట్‌గా సీరియస్ అయ్యాడు రోహిత్. చాన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్నానని.. ఎప్పుడేం చేయాలో తనకు బాగా తెలుసునన్నాడు హిట్‌మ్యాన్. రెండో వన్డే అనంతరం అతడి బ్యాటింగ్‌తో జట్టు ఆటతీరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనదైన శైలిలోనే బ్యాటింగ్ చేశానన్నాడు. ఒకట్రెండు ఇన్నింగ్స్‌లు తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చలేవన్నాడు. సెంచరీ కొట్టానని ఇదేమీ ప్రత్యేకం కాదని.. ఈ రోజు అన్ని రోజుల లాంటిదేనన్నాడు రోహిత్.


గేమ్‌‌ను ఎంజాయ్ చేస్తున్నా!

‘సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో పరుగులు చేశా. ఎలా రన్స్ చేయాలనేది నాకు తెలుసు. అలాగని పరుగులు చేయడం ఈజీ అనుకోకండి. అది అంత తేలిక కాదు. మ్యాచ్‌లో రన్స్ చేయడం కష్టంగా మారింది. కానీ నేను గేమ్‌ను ఎంజాయ్ చేయడం మీదే ఫోకస్ చేశా. బరిలోకి దిగిన ప్రతిసారి బాగా ఆడాలనే అనుకుంటా. కానీ కొన్నిసార్లు అంత బాగా ఆడకపోవచ్చు. అయితే ఏం చేయాలనే విషయం మీద క్లారిటీ ఉన్నప్పుడు మిగతా విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో నాకు తెలుసు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణంగా గత కొన్నాళ్లుగా హిట్‌మ్యాన్‌ మీద విమర్శల జడివాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి పైకామెంట్స్ క్రిటిక్స్‌ను ఉద్దేశించి చేసినవేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.


ఇదీ చదవండి:

టీమిండియా స్టార్లకు డేంజర్

మూడు రోజుల్లోనే..!

రాణించిన సూర్య, రహానె

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 11 , 2025 | 10:09 AM