Share News

Rishabh Pant: రోహిత్ కావాలనే అలా చేశాడు.. పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 03 , 2025 | 05:04 PM

Rohit Sharma: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్‌లో బరిలోకి దిగలేదు. ముందు నుంచి అతడ్ని ఆడించరని వస్తున్న కథనాలు నిజమేనని టాస్ టైమ్‌లో తేలిపోయింది. అయితే రోహిత్‌ కావాలనే ఆడలేదా? లేదా అతడ్ని డ్రాప్ చేశారా? అనేది క్లారిటీ రాలేదు.

Rishabh Pant: రోహిత్ కావాలనే అలా చేశాడు.. పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rishabh Pant

IND vs AUS: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్‌లో బరిలోకి దిగలేదు. ముందు నుంచి అతడ్ని ఆడించరని వస్తున్న కథనాలు నిజమేనని టాస్ టైమ్‌లో తేలిపోయింది. తమ సారథి రోహిత్ ఈ మ్యాచ్‌లో ఆడట్లేదని టెంపరరీ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. అతడి స్థానంలో యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను టీమ్‌లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే రోహిత్‌ను కావాలనే ఆడించలేదా? అతడ్ని పక్కా ప్లాన్‌తోనే డ్రాప్ చేశారా? లేదా పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు కాబట్టి అతడే బెంచ్‌పై కూర్చున్నాడా? అనే ప్రశ్నలు అభిమానుల మదిని తొలచి వేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. హిట్‌మ్యాన్ కావాలనే అలా చేశాడని అన్నాడు. పంత్ ఇంకా ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..


స్కెచ్ ప్రకారమే..

‘బరిలోకి దిగకూడదనేది రోహిత్ భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం. అతడ్ని మేం ఒక సారథిగానే చూస్తాం. అతడు గొప్ప నాయకుడు. అయితే కొన్ని నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు. వాటి విషయంలో మనం ఏమీ చేయలేం. దీని గురించి నేను ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పంత రివీల్ చేశాడు. పంత్ మాటల్ని బట్టి చూస్తే మ్యాచ్‌కు దూరంగా ఉండాలంటూ రోహిత్‌కు మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వెళ్లినట్లే కనిపిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా హిట్‌మ్యాన్ పోరాడటం ఆపడని.. అలాంటోడ్ని పక్కా స్కెచ్ ప్రకారమే టీమ్ నుంచి సైడ్ చేశారని విమర్శిస్తున్నారు.


కెరీర్ క్లోజ్!

రోహిత్ శర్మను సిడ్నీ టెస్టులో ఆడించకపోవడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అతడికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. హిట్‌మ్యాన్ కెరీర్ ముగిసిందని, మెల్‌బోర్న్ టెస్టే అతడికి చివరిదని లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌తో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుందన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్-2027కు అందుబాటులో ఉండే ప్లేయర్ కోసం సెలెక్షన్ కమిటీ అన్వేషిస్తోందని.. అందుకే రోహిత్‌ను సైడ్ చేశారని చెప్పుకొచ్చాడు. అతడి టెస్ట్ కెరీర్ ఇక ముగిసినట్లేనని అభిప్రాయపడ్డాడు.


Also Read:

గంభీర్‌ను నమ్మి మోసపోయిన పంత్.. టీమ్‌లో ప్లేస్ పోతుందనే భయంతో..

బుమ్రాతో పెట్టుకుంటే బుగ్గే.. ఇదీ రివేంజ్ అంటే..

ఒంటి నిండా గాయాలు.. నొప్పి భరిస్తూనే బ్యాటింగ్..

అశ్విన్‌ స్వార్థపరుడు

For More Sports And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 05:04 PM