Rohit Sharma: స్టార్ హీరోయిన్ పోస్ట్.. రోహిత్ శర్మ భార్యపై భారీ ట్రోలింగ్
ABN , Publish Date - Jan 06 , 2025 | 10:17 AM
Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ అనవసర వివాదంలో చిక్కుకుంది. ఆమె పెట్టిన ఒక్క పోస్ట్ అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికాను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇంతకీ ఏంటా పోస్ట్? అనేది ఇప్పుడు చూద్దాం..
సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పలు విషయాలపై తమ అభిప్రాయాలు పంచుకోవడం సాధారణమే. సినీ, క్రీడా, రాజకీయ అంశాలతో పాటు ఇతర విషయాల మీద కూడా స్పందిస్తూ ఉంటారు. నెగెటివ్ పోస్ట్‌లతో సెలెబ్రిటీలు కాంట్రవర్సీల్లో చిక్కుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక్కోసారి పాజిటివ్ పోస్టులతోనూ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఆమె అనవసర వివాదంలో చిక్కుకుంది. విద్యా పెట్టిన ఒక్క పోస్ట్ అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దేను కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇంతకీ ఏంటా పోస్ట్? అందులో స్టార్ హీరోయిన్ ఏం రాసుకొచ్చారు? అనేది ఇప్పుడు చూద్దాం..
విద్యాబాలన్ పోస్ట్..
రీసెంట్‌గా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. నిర్ణయాత్మకంగా మారిన సిడ్నీ టెస్ట్‌లో భారత్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు. ఫామ్ కోల్పోవడం, జట్టుకు వరుస వైఫల్యాలు రావడంతో హిట్‌మ్యాన్‌ను కోచ్ గౌతం గంభీర్ పక్కనబెట్టాడని.. అతడ్ని కావాలనే డ్రాప్ చేశారని వినిపించింది. అయితే రోహిత్ మాత్రం తాను కావాలనే బరిలోకి దిగలేదని.. ఫామ్ సరిగ్గా లేదు కాబట్టి యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఆడలేదన్నాడు. ఇదే విషయంపై రోహిత్‌ను సపోర్ట్ చేస్తూ హీరోయిన్ విద్యాబాలన్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు. అతడో సూపర్‌స్టార్ అంటూ మెచ్చుకున్నారు.
అంతా రితికా పనే!
‘రోహిత్ శర్మ.. వాటే సూపర్‌స్టార్. ఇలా విరామం తీసుకొని తనను తాను విశ్లేషించుకోవడం బాగుంది. ఇలా చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. నీకు మరింత బలం చేకూరాలి. నిన్ను ఎంతో గౌరవిస్తున్నా. కాస్త బ్రేక్ తీసుకొని వచ్చి అదరగొట్టు’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది విద్యాబాలన్. అయితే పోస్ట్ చేసేందుకు టైమ్ లేకనో ఏమో గానీ వాట్సాప్ మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. మెసేజ్‌ను షేర్ చేసినట్లుగా తేలిపోయింది. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఇన్‌స్టా స్టోరీని డిలీట్ చేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రోహిత్ సతీమణి రితికా కావాలనే ఫిల్మ్ సెలెబ్రిటీలతో పోస్టులు పెట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. విద్యాబాలన్‌తో పాటు ఫర్హాన్ అక్తర్ లాంటి వారికి డబ్బులు ఇచ్చి మరీ హిట్‌మ్యాన్‌కు సపోర్ట్‌గా పోస్టులు పెట్టిస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఇన్‌స్టాలో రోహిత్‌ను ఫాలో అవ్వమంటూ విద్యాబాలన్‌పై సీరియస్ అవుతున్నారు.