Share News

Team India: 450 కోట్ల కుంభకోణం.. టీమిండియా స్టార్‌కు సీఐడీ నోటీసులు

ABN , Publish Date - Jan 02 , 2025 | 08:29 PM

Cricket News: భారత జట్టు స్టార్ బ్యాటర్ ఓ భారీ స్కామ్‌లో చిక్కుకున్నాడు. ఏకంగా రూ.450 కోట్ల కుంభకోణంలో అతడు ఇరుక్కున్నాడు. దీంతో అతడికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.

Team India: 450 కోట్ల కుంభకోణం.. టీమిండియా స్టార్‌కు సీఐడీ నోటీసులు
Team India Cricketer

పోంజీ కుంభకోణం.. గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కామ్ ఇది. ఇప్పుడు దీని సెగ టీమిండియా క్రికెటర్లకూ తాకింది. బ్యాంకులతో పోల్చుకుంటే అధిక వడ్డీ ఇస్తామంటూ సామాన్య ప్రజలను నమ్మించి రూ.6 వేల కోట్లు సేకరించిన ఈ కేసులో బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝాలాను గుజరాత్ సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇందులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో పాటు జీటీ ఆటగాళ్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ వంటి పలువురు ప్రముఖ క్రికెటర్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లు తాజాగా బయటకు వచ్చింది.


విచారణకు గిల్!

వివాదాస్పదంగా మారిన బీజెడ్ గ్రూప్‌నకు చెందిన రూ.450 కోట్లకు సంబంధించిన లావాదేవీల మీద ఆరాతీస్తోంది సీఐడీ. ఇందులో భాగంగా గుజరాత్ ఆటగాళ్లకు సమన్లు జారీ చేయనుందని తెలుస్తోంది. వాళ్ల నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకోనుందని సమాచారం. ఈ సంస్థలో గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టాడని వినిపిస్తోంది. మిగతా గుజరాత్ ప్లేయర్లు తక్కువ మొత్తంలో అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం గిల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతూ ఆస్ట్రేలియాలో బిజీగా ఉన్నాడు. అతడు స్వదేశానికి తిరిగొచ్చాక విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఒక్క అనుమానంతో..

బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామంటూ గుజరాత్‌లోని అనేక మంది ప్రజల్ని బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ నమ్మించారు. కొన్నాళ్ల తర్వాత సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో కొందరు వ్యక్తులు సీఐడీకి కంప్లయింట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు.. దర్యాప్తు చేయగా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో 10 మందికి పైగా ఏజెంట్లను అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్, ఆరావళి, సబర్‌కాంత, మెహసానా, వడోదరలోని కంపెనీ ఆఫీసులపై సీఐడీ అధికారులు దాడులు చేశారు. ప్రజలు పెట్టుబడిగా పెట్టిన డబ్బులతో నిందితుడు లగ్జరీ కార్లు, బిల్డింగులు కొనుగోలు చేసినట్లు, పలు విద్యాసంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్లు సీఐడీ గుర్తించింది.


Also Read:

ఆఖరి టెస్ట్.. టీమిండియాలో సంచలన మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే

ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం.. మనూ భాకర్‌ సహా ముగ్గురికి

ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన బచ్చా బ్యాటర్.. ఏం కొట్టాడు రా బాబు..

రోహిత్ నుంచి అతడికి కెప్టెన్సీ పగ్గాలు.. అంతా గంభీర్ అనుకున్నట్లే..

For More Sports And Telugu News

Updated Date - Jan 02 , 2025 | 08:31 PM