Sachin Tendulkar: ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే
ABN , Publish Date - Feb 17 , 2025 | 07:02 PM
IML T20: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. సింహంలా బరికిలో దిగిన మాస్టర్ బ్లాస్టర్.. భీకర షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మళ్లీ మొదలుపెట్టేశాడు. చాన్నాళ్లుగా బ్యాట్ పట్టని మాస్టర్ బ్లాస్టర్.. ఈసారి తలకు హెల్మెట్ పెట్టుకొని, కాళ్లకు ప్యాడ్స్ కట్టుకొని, చేతిలో బ్యాట్ పట్టుకొని రంగంలోకి దిగాడు. ప్రాక్టీస్ అని కూడా మర్చిపోయి బౌలర్లను ఉతికి ఆరేశాడు. రిటైర్మెంట్ ప్రకటించి దశాబ్దానికి పైనే అవుతున్నా అతడిలో అదే పస, కసి కనిపించాయి. బంతి మీద ఫోకస్ ఏమాత్రం తగ్గలేదు. పరుగు చేయాలనే దాహం కూడా అలాగే ఉన్నట్లు కనిపించింది. ఈ వయసులో అతడు ఏ సిరీస్ కోసం ఇలా ప్రిపేర్ అవుతున్నాడో ఇప్పుడు చూద్దాం..
ఆ టోర్నీ కోసమే..!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 కోసం సన్నద్ధమవుతున్నాడు సచిన్. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఆటగాళ్లంతా ఈ లీగ్‌లో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16వ తేదీ వరకు ఈ లీగ్ జరగనుంది. దీంతో టోర్నీకి వారం ముందు నుంచి సన్నాహకాలు షురూ చేశాడు సచిన్. బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగి కసి తీరా బంతిని బాదుతున్నాడు. అతడి ప్రాక్టీస్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకవైపు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కుర్రాళ్ల జోరు, అటు మాస్టర్స్ లీగ్‌లో సచిన్ మెరుపులతో క్రికెట్ లవర్స్‌కు ఫుల్ మీల్స్ ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఈ టోర్నీలో ఇండియా మాస్టర్స్ జట్టు తరఫున సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి ఇతర స్టార్లు కూడా దుమ్మురేపేందుకు రెడీ అవుతున్నారు.
ఇవీ చదవండి:
రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో
రోహిత్-కోహ్లీని కావాలనే ఇరికిస్తున్నారా..
ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి