Rishabh Pant IPL 2025: పంత్ సేనకు క్లాస్ పీకిన సంజీవ్ గోయెంకా.. డ్రెస్సింగ్ రూమ్‌లో..
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:10 PM
Sanjiv Goenka: లక్నో ఓటమితో మరోమారు వైరల్ అవుతున్నాడు ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా. ఆ ఫ్రాంచైజీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.

లక్నో సూపర్ జియాంట్స్ ప్లేయర్ల కంటే ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా పదే పదే వార్తల్లో నిలుస్తుంటాడు. దీనికి కారణంగా క్యాష్ రిచ్ లీగ్‌లో లక్నో పరాజయాలే. ఆ టీమ్ ఓటములు ఎదుర్కొన్న సమయాల్లో కెప్టెన్స్‌పై సంజీవ్ సీరియస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అప్పట్లో ఇదే కారణంతో రైజింగ్ పూణె సూపర్‌జియాంట్స్ టీమ్‌కు సారథ్యం నుంచి లెజెండ్ ఎంఎస్ ధోనీని తొలగించాడాయన. పోయినేడు ఎల్‌ఎస్‌జీ మాజీ కెప్టెన్ రాహుల్‌కు అందరి ముందే చీవాట్లు పెట్టారు. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఎల్‌ఎస్‌జీ కొత్త కెప్టెన్ రిషబ్ పంత్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో క్లాస్ పీకాడు సంజీవ్ గోయెంకా. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..
ఫోకస్ దాని మీదే..
సీజన్ ఇప్పుడే మొదలైందని.. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సిన సానుకూల విషయాలు చాలానే ఉన్నాయని సంజీవ్ గోయెంకా అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతంగా సాగిందన్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో బ్యాటింగ్ చాలా బాగుందని ప్రశంసించాడు. ఈ టీమ్ చాలా యంగ్ అని.. కాబట్టి ప్రతి మ్యాచ్ నుంచి పాజిటివ్ విషయాలను ఎక్కువగా తీసుకోవాలని ఆయన సూచించాడు. 27వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాల్సిన మ్యాచ్ మీద దృష్టి పెట్టాలని స్పష్టం చేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. లాస్ట్ సీజన్ మాదిరిగా కాకపోయినా కొంచెం కూల్‌గా క్లాస్ పీకడం బాగుందని అంటున్నారు. అయితే మ్యాచ్ పూర్తవగానే పంత్‌తో కాస్త సీరియస్‌గా మాట్లాడటం నచ్చలేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఉప్పల్ స్టేడియానికి థమన్.. దుమ్ములేపేలా..
పంత్ వర్సెస్ లక్నో ఓనర్.. ఏం జరిగిందంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి