Sanju Samson: ఈగో తగ్గించుకోకపోతే కెరీర్ ఫినిష్.. సంజూపై వరల్డ్ కప్ హీరో సీరియస్
ABN , Publish Date - Feb 04 , 2025 | 10:46 AM
Team India: టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్ వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. నిన్న మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొట్టిన బ్యాటర్.. ఒకేసారి ఫామ్ కోల్పోవడం అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది.

IND vs ENG: భారత టీ20 జట్టు ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. నిన్న మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అతడు అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఆడిన 5 టీ20ల్లో 3 శతకాలు బాదాడు. దీంతో అదే ఫామ్‌ను బట్లర్ సేన మీద కూడా కంటిన్యూ చేస్తాడని.. బిగ్ నాక్స్‌తో చెలరేగుతాడని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా అతడి ఫామ్ పడిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచుల్లో కలిపి అతడు చేసిన పరుగులు 51. ఆ సిరీస్‌లో అతడి హయ్యెస్ట్ స్కోర్ 26. దీన్ని బట్టే శాంసన్ ఫెయిల్యూర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అతడి బ్యాటింగ్‌పై తాజాగా ఓ వరల్డ్ కప్ హీరో స్పందించాడు. ఆయన ఏమన్నాడంటే..
ఈగోనే కారణం!
సంజూ శాంసన్ బ్యాటింగ్ ఫెయిల్యూర్‌కు అతడి ఈగోనే కారణమని 1983 ప్రపంచ కప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. ఈగో తగ్గించుకోకపోతే అతడి స్థానాన్ని యశస్వి జైస్వాల్ భర్తీ చేయడం ఖాయమన్నాడు. ఆల్రెడీ టెస్టుల్లో ఆడుతున్న జైస్వాల్.. చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌కూ ఎంపికయ్యాడని గుర్తుచేశాడు. శాంసన్ ఇలాగే విఫలమవుతూ పోతే టీ20 టీమ్‌లో అతడి స్థానంలో జైస్వాల్ వచ్చేస్తాడని హెచ్చరించాడు శ్రీకాంత్. ఈగోకు పోయి అతడు కెరీర్ నాశనం చేసుకుంటున్నాడని సీరియస్ అయ్యాడు. షార్ట్ పిచ్ బంతులకు అదే రకమైన షాట్లు కొట్టి వరుసగా ఐదోసారి వికెట్ సమర్పించుకోవడం ఏంటని ఫైర్ అయ్యాడు.
జైస్వాల్ రెడీ!
‘సంజూ శాంసన్ గాడి తప్పినట్లు కనిపిస్తోంది. సిరీస్‌లో వరుసగా ఐదోసారి అతడు ఒకేరీతిలో ఔట్ అయ్యాడు. అదే షాట్ కొట్టి వికెట్ సమర్పించుకున్నాడు. తన ఈగో చూపించాలని అతడు అనుకుంటున్నాడు. షార్ట్ ఆడాల్సిందేనని పంతం పట్టి అలా చేస్తున్నాడు. దీని వల్ల అతడికే నష్టం వాటిల్లుతోంది. శాంసన్ బ్యాటింగ్‌పై అసంతృప్తిగా ఉన్నా. అతడు ఔటైన తీరు నాకు నచ్చలేదు. అతడ్ని చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌కు ఎంపిక చేయలేదు. ఇక మీదటా అతడు ఇలాగే ఆడితే బెంచ్‌పై కూర్చోబెడతారు. జైస్వాల్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి:
కోహ్లీ కొంపముంచిన బస్ డ్రైవర్.. ఎంత పని చేశావ్ భయ్యా
ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌కు బిగ్ షాక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి