Shubman Gill: అభిషేక్‌తో నాకు పోలికేంటి.. శుబ్‌మన్ గిల్ సీరియస్
ABN , Publish Date - Feb 05 , 2025 | 10:28 AM
Abhishek Sharma: ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. ఉతుకుడుకు పరాకాష్టగా నిలిచాడు.

టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సరికొత్త సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు అతడు రెడీ అవుతున్నాడు. రేపటి నుంచి మొదలయ్యే ఈ సిరీస్‌లో సత్తా చాటాలని అతడు అనుకుంటున్నాడు. ఇటీవల కాలంలో అటు రెడ్‌బాల్‌తో పాటు ఇటు వైట్‌బాల్ మ్యాచెస్‌లోనూ పూర్ పెర్ఫార్మెన్స్‌తో అతడు విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో రంజీల బాట పట్టి అక్కడ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అదే ఫామ్‌ను కంటిన్యూ చేసి.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని భావిస్తున్నాడు. వన్డే సిరీస్‌కు ముందు అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లతో తనను పోలిస్తే ఊరుకోనన్నాడు.
అలా ఎవరూ కోరుకోరు!
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రిపరేషన్‌తో పాటు ఇతర విషయాల మీద స్పందించాడు. అదే తరుణంలో టీమ్‌లోని యంగ్‌స్టర్స్ మధ్య కాంపిటీషన్ గురించి కూడా రియాక్ట్ అయ్యాడు. అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో తనను పోల్చొద్దని అన్నాడు. తమ మధ్య ఎలాంటి పోటీ లేదన్నాడు. వాళ్లిద్దరూ తన స్నేహితులని చెప్పాడు గిల్. దేశానికి ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్‌లో 100 శాతం ఎఫర్ట్ పెట్టడం ముఖ్యమని తెలిపాడు. అంతేగానీ ఓ ఆటగాడు బాగా ఆడొద్దని, ఫెయిల్ అవ్వాలని ఎవరూ కోరుకోరంటూ సీరియస్ అయ్యాడు శుబ్‌మన్.
మా టార్గెట్ అదే!
చిన్నప్పటి నుంచి అభిషేక్ తనకు తెలుసునని.. తామిద్దరం ఫ్రెండ్స్ అన్నాడు గిల్. జైస్వాల్‌తోనూ తనకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉందన్నాడు. తమ ముగ్గురిలో ఎవరు ఆడుతున్నా బాగా పెర్ఫార్మ్ చేయాలనే కోరుకుంటామని, టీమ్‌ను గెలిపించాలనే టార్గెట్ పెట్టుకుంటామన్నాడు. ఎవరు జట్టులో ఉన్నా మిగతా వాళ్లు సపోర్ట్ చేస్తారని.. తమ మధ్య పోటీ కాదు స్నేహమే ఉందంటూ ఈ వాదనకు ఫుల్‌స్టాప్ పెట్టాడు గిల్. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ మీదా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాదిన్నర కాలంలో హిట్‌మ్యాన్ ఆడుతున్న తీరు, గేమ్ స్టార్టింగ్ నుంచి అతడు హిట్టింగ్ చేస్తున్న విధానం హైలైట్ అని మెచ్చుకున్నాడు. రోహిత్ బ్యాటింగ్ టీమ్‌కు గేమ్ చేంజింగ్‌గా మారిందన్నాడు గిల్.
ఇదీ చదవండి:
బుమ్రా ప్లేస్‌లో టీమ్‌లోకి స్పిన్ మాంత్రికుడు.. గట్టి ప్లానే
ఒక్క సిరీస్‌తో తక్కువ చేస్తే ఎలా?
మరిన్ని క్రీడలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి