Abhishek Sharma: అభిషేక్ శర్మకు సన్‌రైజర్స్ బంపరాఫర్.. ఓకే అంటే రాత మారిపోతుంది
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:48 PM
IPL 2025: టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మకు సన్‌రైజర్స్ బంపరాఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ అతడు ఓకే అంటే జాతకమే మారిపోతుందట. మరి.. ఆ ఆఫర్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం...

ప్రతిభ ఉన్నోడికి ఒక్క అవకాశం చాలు.. కుంభస్థలం కొట్టడానికి, చరిత్ర తిరగరాయడానికి, నవశకాన్ని ఆరంభించడానికి.. జస్ట్ ఒక్క చాన్స్ చాలు. టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఇది సరిగ్గా సరిపోతుంది. అతడు తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చెలరేగుతున్నాడు. వరుసగా బిగ్ నాక్స్‌తో టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా పరుగులు పెడుతున్నాడు. రీసెంట్‌గా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 37 బంతుల్లో సెంచరీ బాదేసి తానే ఫ్యూచర్ స్టార్‌నని నిరూపించుకున్నాడు. అలాంటోడికి మరో లక్కీ చాన్స్ వరించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
అభిషేక్‌కే ఎందుకంటే..?
అభిషేక్ శర్మకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బంపరాఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఐపీఎల్-2025లో ఎస్‌ఆర్‌హెచ్‌కు వైస్ కెప్టెన్‌గా అభిషేక్‌ను ఎంపిక చేశారని సమాచారం. అభిషేక్‌కు కావ్యా పాప వైస్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అదిరిపోయే ఆరంభాలు అందిస్తూ టీమ్ విజయాల్లో కీలకంగా మారడం, నిలకడగా పరుగులు చేయడం, గేమ్ అవేర్‌నెస్, ఒంటిచేత్తో ఫలితాన్ని తారుమారు చేయడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ ఆటపై ధ్యాస పెట్టడం, తోటి ఆటగాళ్లతో కలసి పోవడం లాంటి లక్షణాలు వైస్ కెప్టెన్సీకి అభిషేక్ బెస్ట్ చాయిస్‌గా నిలబెట్టాయని తెలుస్తోంది.
కొత్త కెప్టెన్?
సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్న కంగారూ స్టార్.. ఐపీఎల్ కొత్త సీజన్‌లోనూ ఆడటం అనుమానంగా మారింది. దీంతో వచ్చే సీజన్ కోసం కొత్త కెప్టెన్‌తో పాటు వైస్ కెప్టెన్‌ను ఎంపిక చేసే పనిలో పడిందట ఎస్‌ఆర్‌హెచ్. అందులో భాగంగానే అభిషేక్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అతడికి గానీ ఆ పోస్ట్ ఇస్తే క్రమంగా సారథ్యం అలవాటు అవుతుంది. ఆ తర్వాత నేరుగా కెప్టెన్ అవ్వొచ్చు. అంతర్జాతీయ మ్యాచుల్లో మరింత నిలకడగా ఆడుతూ పోతే భారత్‌కూ భవిష్యత్తు సారథి అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి.. అభిషేక్ రాత మారుతుందేమో చూడాలి.
ఇవీ చదవండి:
బీసీసీఐకి భారీగా బొక్క పెట్టిన స్టార్ బ్యాటర్
‘చాంపియన్స్’ విజేతకు రూ.19.40 కోట్లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి