Share News

Rohit Sharma: రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో విధ్వంసానికి ప్లాన్

ABN , Publish Date - Feb 17 , 2025 | 05:20 PM

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమవుతోంది టీమిండియా. ఇంకొన్ని గంటల్లో ఈ మహా సంరంభం షురూ కానుంది. పొట్టి ప్రపంచ కప్‌లో చేసిన మ్యాజికే ఇక్కడా రిపీట్ అవ్వాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

Rohit Sharma: రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో విధ్వంసానికి ప్లాన్
Team India

వన్డే ఫార్మాట్‌లో రెండో అతిపెద్ద టోర్నమెంట్ అయిన చాంపియన్స్ ట్రోఫీకి అంతా రెడీ అవుతోంది. మరో రెండ్రోజుల్లో మెగా టోర్నీ మొదలవనుంది. ఫిబ్రవరి 19 నుంచి మొదలయ్యే ఈ మహా సంగ్రామంలో భారత్ గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 ప్రపంచ కప్-2024 ఫలితాన్ని రిపీట్ చేసి కప్పు సొంతం చేసుకోవాలని అంటున్నారు. అందుకు తగ్గట్లే భారత జట్టు కూడా సన్నాహకాల్లో బిజీ అయిపోయింది. టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ప్రాక్టీస్ చేస్తూనే వ్యూహాలకూ పదును పెడుతున్నాడు.


ముందే స్కెచ్ వేశాడా?

దుబాయ్ వేదికగా భారత మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్పిన్ వ్యూహంతో ప్రత్యర్థులను కట్టిపడేయాలని రోహిత్ స్కెచ్ వేస్తున్నాడు. అందుబాటులో ఉన్న ఐదురుగు స్పిన్నర్లు (వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్)లో నుంచి ముగ్గర్ని తప్పకుండా ఆడించాలని అనుకుంటున్నాడట. దీంతో పాటు టీమ్‌లో కనీసం 8 మంది బ్యాటింగ్ చేసేలా ప్లాన్ వేస్తున్నాడట. అందులో భాగంగానే యంగ్ పేసర్ హర్షిత్ రాణాతో హిట్టింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడని తెలిసింది. భారత ఆటగాళ్ల నెట్ సెషన్ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ప్లేయర్లతో రోహిత్ చర్చిస్తున్న తీరు, సూచనలు ఇస్తున్న విధానం అంతా చూస్తే మెగా టోర్నీలో విధ్వంసానికి స్కెచ్ గీసే వచ్చినట్లు కనిపిస్తోందని నెటిజన్స్ అంటున్నారు.


షాట్ ఆఫ్ ది డే!

‘అంచనా వేసి బాల్‌ను ఆడండి.. కవర్స్ ఫీల్డర్‌ను అధిగమిస్తే ఫోర్ పక్కా’ అని రోహిత్ అనడం వీడియోలో చూడొచ్చు. హార్దిక్ పాండ్యా-రవీంద్ర జడేజా కూడా భారీ షాట్లు ఆడటం గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. ఫీల్డింగ్ మీద కూడా ఫోకస్ పెట్టిన రోహిత్.. టెన్నిస్ బాల్‌తో క్యాచ్‌ల ప్రాక్టీస్ చేయిస్తూ దర్శనమిచ్చాడు. అటు పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా భారీ షాట్లు కొడుతూ నెట్స్‌లో హల్‌చల్ చేశాడు. అతడి షాట్ చూసిన పంత్.. ‘క్యా షాట్ హై’ అంటూ మెచ్చుకున్నాడు. మరోవైపు బ్యాటింగ్‌ను ఎలా ఎంజాయ్ చేయాలో గిల్‌కు సజెషన్ ఇస్తూ కనిపించాడు కోహ్లీ. మొత్తంగా ఆటగాళ్లలో దూకుడు పెంచుతూ ఒకవైపు స్పిన్ అస్త్రం, మరోవైపు హిట్టింగ్ ఆయుధాలను పదును పెడుతూ రోహిత్ విధ్వంసానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. దుబాయ్.. ఊపిరి పీల్చుకో ఊచకోతకు సిద్ధమంటూ ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్స్ ఇస్తూ దర్శనమిచ్చాడు.


ఇవీ చదవండి:

రోహిత్-కోహ్లీని కావాలనే ఇరికిస్తున్నారా..

ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..

22 గజాల పిచ్‌పై రోహిత్ చదరంగం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2025 | 06:11 PM