Tilak Varma: ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో తిలక్.. ఆజామూ నీకు మూడింది
ABN , Publish Date - Jan 29 , 2025 | 05:55 PM
ICC Rankings: టీమిండియా యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. వరుసగా స్టన్నింగ్ నాక్స్‌తో క్రికెట్ వరల్డ్ దృష్టిని తన వైపునకు తిప్పుకుంటున్నాడు. ఇదే జోరులో ఓ ప్రపంచ రికార్డు మీద కూడా అతడు కన్నేశాడు.

భారత యువ తరంగం తిలక్ వర్మ మ్యాచ్ మ్యాచ్‌కు మరింత ఇంప్రూవ్ అవుతున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా నమ్మశక్యం కాన్ని నాక్స్ ఆడుతూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. 107 నాటౌట్, 120 నాటౌట్, 19 నాటౌట్, 72 నాటౌట్.. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో తిలక్ స్కోర్లు ఇవి. భారీ ఇన్నింగ్స్‌లతో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడతను. యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడుతూనే.. అవసరమైన సమయంలో తనలోని హిట్టింగ్ రాక్షసుడ్ని బయటకు తీసుకొస్తున్నాడు. భారీ షాట్లతో ప్రత్యర్థుల నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో పాత రికార్డులకు పాతర పెడుతున్నాడు. అలాంటోడు ఓ అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
హెడ్‌ను దాటేయాలి!
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కంగారూ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (832 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హైదరాబాదీ తిలక్ వర్మ (832 రేటింగ్ పాయింట్లు) ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానంలో నిలిచాడు. అంతకంటే ముందు ఆ ప్లేస్‌లో ఉన్న ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను అతడు వెనక్కి నెట్టాడు. టాప్ ప్లేస్‌కు చేరుకోవాలంటే హెడ్‌ను అతడు వెనక్కి నెట్టాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య ఉన్న పాయింట్ల దూరం 23 మాత్రమే.
వాటే చాన్స్!
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 సిరీస్ ఇంగ్లండ్‌తోనే. ఈ సిరీస్‌లో మరో 2 మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఈ రెండింట్లో అతడు బిగ్ నాక్స్ ఆడితే హెడ్‌ను దాటిపోవడం ఖాయం. అప్పుడు టాప్ ప్లేస్‌కు చేరుకుంటాడు. అదే జరిగితే అత్యంత చిన్న వయసులో టీ20 ర్యాంకింగ్స్‌ల్లో అగ్రస్థానానికి చేరుకున్న బ్యాటర్‌గా పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజం పేరిట ఉన్న రికార్డు బద్దలవడం ఖాయం. బాబర్ 23 ఏళ్ల 105 రోజుల వయసులో 2018లో టీ20ల్లో టాప్ ర్యాంక్ సాధించాడు. అదే తిలక్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతడి వయసు 22 ఏళ్ల 82 రోజులు. ఒకవేళ అతడు త్వరలో టాప్ ర్యాంక్‌కు చేరుకుంటే పొట్టి ఫార్మాట్ ర్యాంకుల్లో అతిపిన్న వయసులో ఆ ఫీట్ నమోదు చేసిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఇది తెలిసిన నెటిజన్స్.. ఆజామూ నీ రికార్డుకు మూడింది అంటూ బాబర్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి