Share News

Virat Kohli: సింగిల్ సెషన్‌లో ఖేల్ ఖతం.. ఆసీస్‌కు నరకం చూపించిన కోహ్లీ

ABN , Publish Date - Jan 04 , 2025 | 07:33 PM

IND vs AUS: ఆస్ట్రేలియా అంటే అన్ని జట్లు వణుకుతాయి. కానీ ఆ టీమ్‌కు భయం అంటే ఏంటో అతడు పరిచయం చేశాడు. ఒక్క సెషన్‌లోనే వాళ్ల కథ ముగించాడు. సిరీస్ వచ్చినా, పోయినా టీమిండియాతో మ్యాచ్ అంటే వణికేలా చేశాడు.

Virat Kohli: సింగిల్ సెషన్‌లో ఖేల్ ఖతం.. ఆసీస్‌కు నరకం చూపించిన కోహ్లీ
Virat Kohli

ఆస్ట్రేలియా అంటే అన్ని జట్లు కూడా వణుకుతాయి. ఆ టీమ్‌తో మ్యాచ్ ఉంటే భయపడతాయి. అదీ వాళ్ల సొంతగడ్డ మీద అంటే గ్రౌండ్‌లోకి దిగాలంటేనే షేక్ అవుతాయి. కానీ దీన్ని బ్రేక్ చేశాడో ప్లేయర్. ఆసీస్ గడ్డపై నీళ్లు తాగినంత ఈజీగా పరుగులు చేయొచ్చని ప్రూవ్ చేశాడు. 50కి పైగా స్ట్రైక్ రేట్‌తో కంగారూలకు వణుకు పుట్టించాడు. వరుస మ్యాచుల్లో గెలుపుతో టెస్ట్ సిరీస్‌ను జట్టుకు అందించాడు. అతడే మోడ్రన్ మాస్టర్ విరాట్ కోహ్లీ. ఆసీస్‌ను ఆసీస్ గడ్డపై ఓడించడం సాధ్యమేనని ప్రూవ్ చేసిన కోహ్లీ ఈసారి బీజీటీలో బ్యాట్‌తో ఫెయిల్ అవుతున్నాడు. అయితే తనలోని కెప్టెన్సీ నైపుణ్యాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయని నిరూపించాడు. అటాకింగ్ కెప్టెన్సీతో ఆతిథ్య జట్టును భయపెట్టాడు. సింగిల్ సెషన్‌లోనే వాళ్ల ఆట కట్టించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.


తప్పనిసరి పరిస్థితుల్లో..!

సిడ్నీ టెస్ట్ రెండో రోజు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పేలవ ఫామ్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో సారథ్య బాధ్యతలు చేపట్టాడు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో 10 ఓవర్లు వేశాక అతడు గ్రౌండ్‌ను వీడాడు. ఇంజ్యురీలా అనిపించడంతో డ్రెస్సింగ్ రూమ్‌కు.. అటు నుంచి స్కానింగ్ కోసం హాస్పిటల్‌కు వెళ్లాడు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ.. టీమ్‌ను ఫెంటాస్టిక్‌గా నడిపించాడు. వింటేజ్ విరాట్‌ను గుర్తుచేస్తూ టైట్ ఫీల్డింగ్, అటాకింగ్ బౌలింగ్, స్లెడ్జింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. అతడి దెబ్బకు ఒక్క సెషన్‌లోనే ఆసీస్ ఆలౌట్ అయిపోయింది.


అటాక్.. అటాక్.. అటాక్!

ఒకదశలో 96 పరుగులకు 4 వికెట్లతో పటిష్టంగా కనిపించింది ఆస్ట్రేలియా. అయితే కెప్టెన్‌గా చార్జ్ తీసుకున్న కోహ్లీ చకచకా ఫీల్డింగ్ మార్పులు చేశాడు. డిఫెన్స్ అప్రోచ్‌ను పక్కనబెట్టి ఫీల్డర్లతో అటాక్ చేయించాడు. సింగిల్ తీయాలన్నా భయపడేలా చేశాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ రెడ్డితో దూకుడుగా బౌలింగ్ చేయించాడు. బౌన్సర్లతో ఆసీస్ బ్యాటర్లకు పరీక్ష పెట్టాడు. ఇందులో వాళ్లు అట్టర్‌ఫ్లాప్ అయ్యారు. కోహ్లీ కెప్టెన్సీ, బౌలర్ల దూకుడు ముందు వాళ్లు తేలిపోయారు. 85 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది ఆసీస్. ఒకే సెషన్‌లో ఆ టీమ్ కుప్పకూలింది. ఈజీగా భారత్ స్కోరును దాటేస్తామని భావించిన టీమ్.. కోహ్లీ పట్టుదల, బౌలర్ల సాహసం ముందు నిలబడలేకపోయింది. తన సారథ్యంతో ఆతిథ్య జట్టుకు నరకం చూపించినందుకు విరాట్‌ను అభిమానులు మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

ఆసీస్ వెన్ను విరిచిన నితీష్ రెడ్డి.. బౌలింగ్ అంటే ఇది

టీమిండియా స్టార్లకు కలసిరాని మ్యారేజ్.. సోలో బతుకే సో బెటర్

టీమిండియా గేమ్ ఓవర్.. రాజు లేని రాజ్యం అయిపోయింది..

మరిన్ని క్రీడా వార్తలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 04 , 2025 | 07:37 PM