Share News

Yuvraj Singh: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగోదు.. యువరాజ్ మాస్ వార్నింగ్!

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:42 PM

టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ తన మనసులో ఏది ఉంటే అదే చెబుతాడు. మనసులో ఒకటి ఉంచుకొని, పైకి మాట్లాడటం అతడికి చేతకాదు. తాను ఏది చెప్పాలని అనుకుంటాడో అది ధైర్యంగా, సూటిగా చెప్పడం అతడి స్టైల్.

Yuvraj Singh: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగోదు.. యువరాజ్ మాస్ వార్నింగ్!
Yuvraj Singh

టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ తన మనసులో ఏది ఉంటే అదే చెబుతాడు. మనసులో ఒకటి ఉంచుకొని, పైకి మాట్లాడటం అతడికి చేతకాదు. తాను ఏది చెప్పాలని అనుకుంటాడో అది ధైర్యంగా, సూటిగా చెప్పడం అతడి స్టైల్. రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఈ దిగ్గజ ఆల్‌రౌండర్.. శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి యంగ్‌స్టర్స్‌కు కోచింగ్ ఇస్తూ మెరికల్లా తీర్చిదిద్దాడు. సందర్భం వచ్చినప్పుడల్లా టీమిండియా గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ షేర్ చేసుకునే యువీ.. తాజాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ మీద స్పందించాడు. వాళ్ల గురించి పలువురు అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ సీరియస్ అయ్యాడు. యువీ ఇంకా ఏమన్నాడంటే..


సపోర్ట్ చేయాల్సింది పోయి..

‘టీమిండియా గత 5 ఏళ్లలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో వెంటవెంటనే రెండుసార్లు సిరీస్‌‌ను సొంతం చేసుకుంది. కంగారూ గడ్డ మీద బ్యాక్ టు బ్యాక్ సిరీస్ నెగ్గిన టీమ్ ఉంటే చూపించండి. ఈ ఘనత సాధించిన మరో జట్టు లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ జనరేషన్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు. కానీ ఇప్పుడు వాళ్ల గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. భారత జట్టుకు వాళ్లిద్దరూ అందించిన సేవలు, గెలిపించిన ట్రోఫీలు, బాదిన పరుగులను మర్చిపోకూడదు. ఓడినంత మాత్రం ఇలా విమర్శిస్తే ఎలా? మన ఆటగాళ్లంతా నా ఫ్యామిలీ. వాళ్లకు సపోర్ట్ చేస్తూనే ఉంటా’ అని యువరాజ్ వ్యాఖ్యానించాడు.


వాళ్లే డిసైడ్ చేయాలి!

ఆసీస్ చేతుల్లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని.. కానీ వాళ్ల కంటే ఎక్కువ బాధ టీమిండియా ప్లేయర్లకు ఉంటుందన్నాడు యువీ. భారత క్రికెట్‌కు ఏది బెస్ట్ అనేది జైషా, బీసీసీఐ పెద్దలు డిసైడ్ చేస్తారన్నాడు. ఫామ్‌లో లేడనే కారణంతో రోహిత్ టీమ్ నుంచి బయటకు రావడం, బెంచ్‌పై కూర్చోవడం మామూలు విషయం కాదన్నాడు. టీ20 వరల్డ్ కప్‌ను దేశానికి అందించిన కెప్టెన్.. టీమ్ కోసం ఈ పని చేయడం గొప్ప విషయమన్నాడు యువరాజ్. బీజీటీ ఓటమి కంటే కూడా న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నాడు. ఆసీస్‌పై గత సిరీస్‌ల్లో గెలిచాం కాబట్టి.. ప్రస్తుత ఓటమిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నాడు.


ఇవీ చదవండి:

సెలెక్షన్‌లో ప్రాంతీయ భేదాలు.. ఇదెక్కడి న్యాయం..

హీరోయిన్‌తో ప్రేమలో పడిన గిల్.. ఎవరీ రిద్ధిమా..

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్-కోహ్లీని ఆడిస్తారా.. ఆపేస్తారా..

రోహిత్‌కు అంబానీ వార్నింగ్.. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2025 | 01:47 PM

News Hub