Share News

Yuvraj Singh: ఈ జనరేషన్‌లో అతడే బెస్ట్ ప్లేయర్.. కుండబద్దలు కొట్టిన యువరాజ్

ABN , Publish Date - Feb 19 , 2025 | 02:22 PM

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ మొదలైపోయింది. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Yuvraj Singh: ఈ జనరేషన్‌లో అతడే బెస్ట్ ప్లేయర్.. కుండబద్దలు కొట్టిన యువరాజ్
Yuvraj Singh

క్రికెట్‌లో బెస్ట్ ప్లేయర్ ఎవరు? అనేది ఎప్పటికీ ముగిసిపోని చర్చ. ఆ ఆటగాడు గొప్ప? అంటే ఆ ఆటగాడు గొప్ప? అంటూ ఫ్యాన్స్ నిత్యం గొడవపడుతుంటారు. అయితే ప్రతి తరంలో ఒకరిద్దరు క్రికెటర్లు మాత్రం అద్భుతమైన ఆటతీరుతో గేమ్‌పై చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వాళ్లే బెస్ట్ అని సీనియర్ క్రికెటర్లు, ఎక్స్‌పర్ట్స్ మెచ్చుకుంటారు. ఇప్పుడు టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ కూడా ఓ ఆటగాడ్ని ఇలాగే ప్రశంసించాడు. ఈ జనరేషన్‌లో అతడే బెస్ట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. మరి.. యువీ లాంటి దిగ్గజం నుంచి ప్రశంసలు అందుకున్న ఆ ప్లేయర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..


పోటీనే లేదు!

‘ఈ జనరేషన్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. అతడ్ని నేను కింగ్ కోహ్లీ అని పిలుస్తుంటా. చాలా ఏళ్ల పాటు అతడు మహావిరాట్‌గా కొనసాగాడు. కెరీర్‌ను గమనిస్తే.. 15 నుంచి 18 ఏళ్ల పాటు భీకర ఫామ్‌లో కొనసాగాడు. ఇది మామూలు విషయం కాదు. అతడి గ్రాఫ్ కూడా అదే రేంజ్‌లో ఉంది. ఈ తరంలో అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్ ప్లేయర్‌గా కోహ్లీని చెప్పొచ్చు. అతడికి పోటీనే లేదు’ అని యువరాజ్ చెప్పుకొచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యువీ.. కోహ్లీని మించినోడు లేడంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు.


చెమటలు కక్కుతూ..

చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌కు చేరుకున్న విరాట్ కోహ్లీ నెట్ సెషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కెరీర్ చరమాంకంలో ఉండటంతో మళ్లీ చాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం కనిపించడం లేదు. అందుకే చివరి చాంపియన్స్ ట్రోఫీలో పరుగుల వరద పారించి టోర్నీని చిరస్మరణీయం చేసుకోవాలని కోహ్లీ భావిస్తున్నాడు. మైలురాళ్ల కంటే జట్టు విజయమే ధ్యేయంగా ఆడాలని అనుకుంటున్నాడట విరాట్. టీమ్ గెలుపు కోసం ఏం చేయడానికైనా వెనుకాడొద్దనే ఉద్దేశంతో గంటల కొద్దీ నెట్ సెషన్స్‌లో చెమటలు కక్కుతున్నాడని సమాచారం. ఈ తరుణంలో యువీ చేసిన వ్యాఖ్యలు అతడిలో మరింత కాన్ఫిడెన్స్ నింపుతాయని చెప్పొచ్చు.


ఇవీ చదవండి:

దిగొచ్చిన పాక్.. భారత్‌తో అట్లుంటది

రో-కోలకు చివరి చాన్స్‌

కర్రాన్‌ సెంచరీ.. జింబాబ్వేదే సిరీస్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2025 | 02:22 PM