Share News

Dhanashree Verma: నాకు అక్కర్లేదు.. డివోర్స్ రూమర్స్‌పై ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:29 AM

Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు సిద్ధమవుతున్నట్లు కొన్ని రోజులుగా వినిపిస్తోంది. సతీమణి ధనశ్రీ వర్మను ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు అన్‌ఫాలో చేయడం, ధశశ్రీ కూడా అతడ్ని అన్‌ఫాలో చేయడంతో డివోర్స్ న్యూస్‌కు మరింత బలం చేకూరింది.

Dhanashree Verma: నాకు అక్కర్లేదు.. డివోర్స్ రూమర్స్‌పై ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్
Yuzvendra Chahal Dhanashree Verma

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులకు సిద్ధమవుతున్నట్లు కొన్ని రోజులుగా వినిపిస్తోంది. సతీమణి ధనశ్రీ వర్మను ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు అన్‌ఫాలో చేయడం, ధనశ్రీ కూడా అతడ్ని అన్‌ఫాలో చేయడంతో డివోర్స్ న్యూస్‌కు మరింత బలం చేకూరింది. ఇన్‌స్టా నుంచి ధనశ్రీ ఫొటోలను చాహల్ తొలగించాడు. అయితే ఆమె మాత్రం అతడితో దిగిన ఫొటోలు, వీడియోలను మాత్రం అలాగే ఉంచేసింది. ఇదే తరుణంలో ధనశ్రీ తన ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలు వైరల్ అవడం, అటు చాహల్ మరో అమ్మాయితో ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వీళ్లు విడాకులు తీసుకోవడం ఖాయమనే పుకార్లు ఇంకా పెరిగాయి. ఈ వివాదంపై తాజాగా స్పందించింది ధనశ్రీ వర్మ. ఇన్‌స్టా పోస్ట్‌తో అసలు ఏం జరుగుతోంది? అనేది క్లారిటీ ఇచ్చింది. తనకు అక్కర్లేదంటూ సీరియస్ కామెంట్స్ చేసింది.


సత్యానిదే విజయం!

‘గత కొన్ని రోజులుగా నేను, నా కుటుంబ సభ్యులు కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. వాస్తవాలు ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారు. అన్నీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నా మీద ద్వేషం కలిగేలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇది నన్ను చాలా బాధకు గురిచేసింది. కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకునేందుకు నేనెంతో శ్రమించా. ఏళ్ల కొద్దీ చాలా కష్టపడుతూ ఇక్కడి వరకు వచ్చా. నేను సైలెంట్‌గా ఉన్నానంటే బలహీనంగా ఉన్నట్లు కాదు. నెట్టింట నెగెటివిటీ ఉన్నప్పటికీ ఇతరుల మీద దయ, కరుణ చూపాలంటే ఎంతో ధైర్యం కావాలి. నేను విలువలతో ముందుకెళ్తున్నా. ఎప్పటికైనా విజయం సత్యానిదే. సమర్థించుకోవాల్సిన అవసరం, అక్కర నాకు లేవు’ అని ఇన్‌స్టా పోస్ట్‌లో ధనశ్రీ స్పష్టం చేసింది.


నిజంగా విడిపోతున్నారా?

చాహల్-ధనశ్రీ విడిపోతున్నారంటూ చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ మధ్య దీనిపై స్టార్ స్పిన్నర్ క్లారిటీ ఇచ్చాడు. తాము కలిసే ఉన్నామంటూ డివోర్స్ రూమర్స్‌ను కొట్టిపారేశాడు. అయితే ఇప్పుడు మళ్లీ వీళ్ల విడాకుల పుకార్లు జోరందుకున్నాయి. చాహల్-ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకర్నొకరు అన్‌ఫాలో అవడం, ధనవ్రీ ఫొటోలను స్టార్ స్పిన్నర్ డిలీట్ చేయడం, ఫ్రెండ్‌తో ధనశ్రీ దిగిన ఫొటోలు వైరల్ అవడం, ఒక అమ్మాయితో చాహల్ ఉన్న ఫొటోలు బయటకు రావడం, అతడు మద్యం మత్తులో బాధగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో వీళ్లు నిజంగానే విడిపోతున్నారనే న్యూస్‌కు మరింత బలం చేకూరినట్లయింది.


ఇవీ చదవండి:

ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌పై బ్యాన్.. పంతం పట్టి చేశారుగా..

చాంపియన్స్‌ బరిలో ఎవరు?

అంతర్జాతీయ క్రికెట్‌కు గప్తిల్‌ గుడ్‌ బై

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 09 , 2025 | 11:37 AM