Share News

Khel Ratna Award: తెలుగు అమ్మాయికి దక్కని ఖేల్‌రత్న.. మరోసారి అన్యాయం

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:58 PM

Khel Ratna Award: క్రీడల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖేల్‌రత్న పురస్కారాలను తాజాగా ప్రకటించింది కేంద్ర సర్కారు. అలాగే అర్జున అవార్డులను కూడా అనౌన్స్ చేసింది. అయితే ఈ పురస్కారాల్లో ఓ తెలుగు అమ్మాయికి మాత్రం మళ్లీ మొండిచెయ్యి ఎదురైంది.

Khel Ratna Award: తెలుగు అమ్మాయికి దక్కని ఖేల్‌రత్న.. మరోసారి అన్యాయం
Vennam Jyothi Surekha

క్రీడల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను తాజాగా ప్రకటించింది కేంద్ర సర్కారు. అలాగే అర్జున అవార్డులను కూడా అనౌన్స్ చేసింది. 2024 సంవత్సరానికి గానూ నలుగురు క్రీడాకారులను ఖేల్‌రత్నకు ఎంపిక చేసింది. ఇందులో ఒలింపిక్స్‌ డబుల్ మెడలిస్ట్ మను బాకర్, వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ విన్నర్ డి.గుకేశ్, హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. అలాగే గతేడాది క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 32 మంది ప్లేయర్లకు అర్జున అవార్డు ప్రకటించింది సర్కారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న ఒక తెలుగు అమ్మాయికి మాత్రం మొండిచెయ్యి ఎదురైంది. ఈసారైనా ఖేల్‌రత్న వస్తుందని అనుకుంటే మళ్లీ అన్యాయం జరిగింది. ఆ క్రీడాకారిణి ఎవరు? ఆమెకు ఎందుకు పతకం దక్కడం లేదు? అనేది ఇప్పుడు చూద్దాం..


ఇంత సాధించినా..

ప్రముఖ ఆర్చర్, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు మరోసారి అన్యాయం జరిగింది. నాలుగు సంవత్సరాలుగా ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఆమెకు అవార్డు దక్కలేదు. ఈ సంవత్సరం కూడా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమె పేరు ప్రతిపాదించలేదు. గతేడాది ఏషియన్ గేమ్స్‌లో 3 బంగారు పతకాలను సాధించిన ఏకైక క్రీడాకారిణి జ్యోతి సురేఖ. ఇప్పటివరకు 62 అంతర్జాతీయ మెడల్స్ సాధించిన ఈ తెలుగు అమ్మాయి పేరు తాజాగా ప్రకటించిన అవార్డు లిస్టులో లేకపోవడంపై క్రీడాభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి సురేఖకు పురస్కారం రాకపోవడం వెనుక కారణాలను తెలుసుకొని న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఆర్చరీ అభిమానులు.


Also Read:

టీమిండియా ప్లేయింగ్ 11‌లో సంచలన మార్పులు

మనూ భాకర్‌ సహా ముగ్గురికి ఖేల్‌రత్న

పంత్‌పై వేటు.. గిల్‌కు చోటు?

బుమ్రాను నిరోధించేలా చట్టం

For More Sports And Telugu News

Updated Date - Jan 02 , 2025 | 05:00 PM