Share News

IPL: కోహ్లీ, రోహిత్‌ కోసం కాదు..ఈ ముగ్గురు ముద్దుగుమ్మల కోసం కూడా ఐపీఎల్‌ చూసే వాళ్లు ఉన్నారని తెలుసా..

ABN , Publish Date - Mar 17 , 2025 | 06:02 PM

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో తమ జట్లలో ఉత్సాహం నింపే ఈ ముగ్గురు బ్యూటిఫుల్ క్వీన్స్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కు మహా ఇష్టం. ప్రత్యేకించి మ్యాచ్ జరిగే సమయంలో వీళ్ల ఎక్స్‌ప్రెషన్స్ కోసమే ఫ్యాన్స్ ఎదురుచూస్తారంటే నమ్ముతారా.. తమ గ్లామస్, ఎనర్జీతో ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌కు కొత్త ఊపు తీసుకొస్తున్న ఆ ముద్దుగుమ్మలు వీళ్లే..

IPL: కోహ్లీ, రోహిత్‌ కోసం కాదు..ఈ ముగ్గురు ముద్దుగుమ్మల కోసం కూడా ఐపీఎల్‌ చూసే వాళ్లు ఉన్నారని తెలుసా..
Most Gorgeous IPL Owners

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ క్రికెట్ అభిమానులకు మరింత ఉత్కంఠతను, వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ మెగా టోర్నమెంట్‌లో జట్లు మాత్రమే కాదు. యజమానులు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ముఖ్యంగా, ముగ్గురు గ్లామరస్ యజమానులు కావ్య మారన్ (SRH), ప్రీతి జింటా (PBKS), జూహి చావ్లా (KKR). వీరు స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ ముగ్గురు క్రికెట్‌పై తమ మక్కువతో పాటు, వారి స్టైల్, ఎలిగెన్స్, ఎనర్జీతో ఈ సీజన్‌ను మరింత రంగరించనున్నారు.


కావ్య మారన్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

సన్ గ్రూప్ వారసురాలు కావ్య మారన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ యజమానిగా IPLలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తండ్రి కళానిధి మారన్ నుంచి వ్యాపార పరిపాటీని స్వీకరించిన ఆమె, జట్టును విజయపథంలో నడిపేందుకు తన శక్తిని అంకితం చేస్తోంది.

IPL వేలం ప్రక్రియలో కావ్య మారన్ ఎప్పుడూ చురుగ్గా పాల్గొంటుంది. మ్యాచ్‌ల సమయంలో స్టేడియంలో కనిపించే ఆమె ఉత్సాహం, రియాక్షన్లు, సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఆమె ఎనర్జీ, స్టైల్, ఫోకస్,.. ఈ మూడు లక్షణాలే SRH అభిమానులను ఆకర్షిస్తున్నాయి. IPL 2025లోనూ, కావ్య మారన్ స్టేడియంలో తన ప్రెజెన్స్‌తో హీట్ పెంచడం ఖాయం.


ప్రీతి జింటా - పంజాబ్ కింగ్స్ (PBKS)

బాలీవుడ్ అందగత్తె ప్రీతి జింటా, IPLలో స్థిరంగా కనిపించే సెలబ్రిటీల్లో ఒకరు. 2008లో పంజాబ్ ఫ్రాంచైజీకి యజమానిగా మారిన ఆమె, ఇప్పటివరకు జట్టును ఎంతో ప్రేమతో, పట్టుదలతో ముందుకు నడిపిస్తోంది.

జట్టు ఫలితాలకన్నా, ఆటగాళ్లను ప్రోత్సహించడమే ఆమె లక్ష్యం. ప్రీతి జింటా తన చిరునవ్వుతో, ఎనర్జీతో స్టేడియాన్ని మరింత రంగరించేస్తుంది. ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయినప్పటికీ, PBKSపై ఆమె నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. 50 ఏళ్ల వయసులో కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ సీజన్‌లోనూ, ఆమె స్టేడియంలో జట్టు కోసం నిబద్ధతతో, ఉత్సాహంతో కనిపించడం ఖాయం.


జూహి చావ్లా - కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

90’s బాలీవుడ్ స్టార్ జూహి చావ్లా, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహ యజమానిగా తన ప్రత్యేకమైన ముద్ర వేసింది. షారుఖ్ ఖాన్‌తో కలిసి ఫ్రాంచైజీని నిర్వహిస్తున్న ఆమె, KKR బ్రాండ్‌ బిల్డింగ్‌లో కీలక పాత్ర పోషించింది.

KKR 2024లో టైటిల్ గెలుచుకున్న సమయంలో, జూహి చావ్లా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన KKRను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆమె పూర్తి మద్దతునిస్తోంది. స్టేడియంలో సంప్రదాయ దుస్తులతో హుందాగా, తన స్వభావంతో ఆకర్షణీయంగా కనిపించే జూహి, ఈ సీజన్‌లోనూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోనుంది.


Read Also : Sourav Ganguly in Khakee: ఖాకీ సిరీస్‌‌లో గంగూలీ.. టీజర్‌లో షాకిచ్చిన బెంగాల్ టైగర్.. అసలు కథేంటంటే..

ఇండియాదే ‘మాస్టర్స్‌’

ఫ్యామిలీ ఉండాల్సిందే!

Updated Date - Mar 17 , 2025 | 06:37 PM