Airplane: విమానం టేకాఫ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం
ABN , Publish Date - Mar 18 , 2025 | 07:33 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వారణాసి వెళ్తున్న 6ఈ 6719 ఇండిగో విమానం విమానం టేకాఫ్ సమయంలో ఎమర్జెన్సీ డోర్ ను ఓ యువకుడు డోర్ తెరవడానికి యత్నించగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విమానంలో ప్రయాణిరుల్లో ఆందోళన వ్యక్తమైంది.

యువకుడిపై కేసు నమోదు
శంషాబాద్(హైదరాబాద్): ఇండిగో విమానం(Indigo flight)లో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) నుంచి వారణాసి వెళ్తున్న 6ఈ 6719 ఇండిగో విమానం సాయంత్రం 4.18 గంటలకు టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో బిహార్(Bihar)కు చెందిన సౌరవ్‌కుమార్ చల్భే(26) ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి యత్నించగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: AC buses: రద్దీ రూట్లలో ఏసీ బస్సులు..
దీంతో ఎయిర్‌లైన్స్(Airlines) అధికారులతో వాగ్వాదానికి దిగాడు. విమానం దిగిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీసులు(Airport Police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. సౌరవ్‌కుమార్ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడని, అతడిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశామని సీఐ బాల్‌రాజ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టన్నుల్లో స్మగ్లింగ్.. గ్రాముల్లో పట్టివేత
టికెట్ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు
ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..
వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News and National News