Share News

MLA: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:52 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌(Goshamahal MLA T. Rajasingh) విమర్శించారు. ఒకప్పుడు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్లు లంచాలు తీసుకోవాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు అలా లేదన్నారు.

MLA: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- లంచాల అడ్డాగా రాష్ట్రం..

హైదరాబాద్: కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌(Goshamahal MLA T. Rajasingh) విమర్శించారు. ఒకప్పుడు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్లు లంచాలు తీసుకోవాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు అలా లేదన్నారు. ఇటీవల కరీంనగర్‌ జమ్మికుంట పోలీస్‏స్టేషన్‌(Karimnagar Jammikunta Police Station)కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ రూ.3లక్షలు లంచం తీసుకున్నట్లు ఓ బాధితుని ఆడియో వైరల్‌ అయిందని, తాజాగా తన సొంత నియోజకవర్గమైన గోషామహల్‌(Gosha Mahal) పరిధిలోని సాయినాత్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబూచౌహాన్‌ ఓ కేసులోనిందితుని పేరు తొలగించడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Collector: అనుమతిలేని ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి


city8.2.jpg

ఈ సంవత్స రం చాలామంది పోలీస్‌ అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారన్నారు. ప్రజలకు అండగా ఉండి, సమాజానికిరక్షణ కల్పించాల్సి న పోలీసులే ఇలా లంచాలు తీసుకుంటే ప్రజలకు ఎక్కడ న్యాయం దొరుకుతుందని ప్రశ్నించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ చొరవ తీసుకుని ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని సూచించారు. లంచాలు తీసుకునే పోలీస్‌ అధికారులను విధులనుంచి తొలగించేలా ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరముందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు

ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం

ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్‌ నజర్‌

ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 25 , 2025 | 01:52 PM