Share News

Congress: రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు..

ABN , Publish Date - Jan 11 , 2025 | 09:11 AM

రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ పార్టీకి, బీఆర్‌ఎస్‌ నాయకులకు లేదని కూకట్‌పల్లి పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం(Satyam Srirangam) అన్నారు. ప్రెస్‌మీట్‌లో కేటీఆర్‌(KTR) మాట్లాడిన తీరుపై ఆయన మండిపడ్డారు.

Congress: రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు..

హైదరాబాద్: రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ పార్టీకి, బీఆర్‌ఎస్‌ నాయకులకు లేదని కూకట్‌పల్లి పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం(Satyam Srirangam) అన్నారు. ప్రెస్‌మీట్‌లో కేటీఆర్‌(KTR) మాట్లాడిన తీరుపై ఆయన మండిపడ్డారు. పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌(BRS) పాలనలో రైతులకు ఏంచేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. ఇచ్చిన హామీలపై చర్చించడానికి సీఎం అక్కర్లేదని, చర్చించడానికి పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, సీనియర్‌ నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Sankranti festival: సంక్రాంతికి సొంతూర్లకు చలో..


కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రూ. 21వేల కోట్లతో 22 లక్షల పైచిలుకు కటుంబాలకు న్యాయం చేసిందని గుర్తు చేశారు. ఉద్యోగాలు ఇస్తామని మోస పూరిత వాగ్దానాలు బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం చేస్తే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 50వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. ఎన్నికల ముందు రైతులకు హామీలిచ్చి ఎన్నికలయ్యాక చేతులెత్తేస్తే అధికారంలోకి రాగే రెండు లక్షల పై చిలుకు రైతు రుణమాపీ చేసింది రేవంత్‌ సర్కార్‌ ఒక్కటేనని అన్నారు.


city7.2.jpg

రాబోయే రోజుల్లో కేటీఆర్‌ చేసిన అక్రమాలను బయట పెడతామని, శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన కేటీఆర్‌కు హితకు పలికారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేకుంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆగ్రహానికి గురికాక తప్పదని సత్యం శ్రీరంగం హెచ్చరించారు.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2025 | 09:11 AM