Share News

RTC buses: సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పది నిమిషాలకో బస్సు

ABN , Publish Date - Jan 09 , 2025 | 07:27 AM

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌(Cherlapalli Railway Terminal)కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని చెంగిచర్ల డిపో మేనేజర్‌ కె. కవిత(Chengicherla Depot Manager K. Kavitha) తెలిపారు.

RTC buses: సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పది నిమిషాలకో బస్సు

హైదరాబాద్: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌(Cherlapalli Railway Terminal)కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని చెంగిచర్ల డిపో మేనేజర్‌ కె. కవిత(Chengicherla Depot Manager K. Kavitha) తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సికింద్రాబాద్‌ బ్లూసీ పాయింట్‌ నుంచి బయలు దేరే రూట్‌ నం. 250సి సిటీ బస్సు ప్రతిరోజూ ఉదయం 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చర్లపల్లి నుంచి చెన్నై, గోరఖ్‌పూర్‌కు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు


ఈ రూటు బస్సు సికింద్రాబాద్‌ నుంచి మెట్టుగూడ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, హెచ్‌పీసీఎల్‌ మీదుగా చర్లపల్లి ప్లాట్‌ ఫారం నంబర్‌ 1కు చేరుకుంటుంది. చర్లపల్లి టెర్మినల్‌ నుంచి చెంగిచర్ల, ఉప్పల్‌, రామంతాపూర్‌(Chengicherla, Uppal, Ramanthapur) మీదుగా బోరబండకు బస్సును ప్రారంభించినట్లు తెలిపారు.


city2.2.jpg

40 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుందన్నారు. సంక్రాంతి పండగ(Sankranti festival)ను పురస్కరించుకొని రైల్వే అధికారులు నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఉప్పల్‌ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్లాట్‌ఫారం నం.9 వరకు అదనపు బస్సులను నడుపుతున్నట్లు ఆమె వివరించారు.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 07:27 AM