Share News

Centre Release: రాష్ట్రానికి 3,637 కోట్లు

ABN , Publish Date - Jan 11 , 2025 | 02:44 AM

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్ర మొత్తం రూ.1,73,030 కోట్లను విడుదల చేయగా ఇందులో తెలంగాణ వాటాగా రూ.3,637 కోట్లు కేటాయించింది.

Centre Release: రాష్ట్రానికి 3,637 కోట్లు

  • కేంద్ర పన్నుల్లో వాటాగా తెలంగాణకు మంజూరు

  • ఏపీకి రూ.7,002 కోట్లు

  • మూలధన వ్యయం, సంక్షేమాభివృద్ధికి విడుదల

హైదరాబాద్‌, జనవరి10(ఆంధ్రజ్యోతి): కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్ర మొత్తం రూ.1,73,030 కోట్లను విడుదల చేయగా ఇందులో తెలంగాణ వాటాగా రూ.3,637 కోట్లు కేటాయించింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,002 కోట్లు ఇచ్చింది. ఈ కేటాయింపుల్లో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా రూ.31,039 కోట్లు ఇచ్చింది.


మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా కింద రూ.18,384.19 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. నవంబరు నాటికి రూ.11,472.79 కోట్లు(62.41ు) అందాయి. తాజాగా వచ్చిన నిధులతో కలిపి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.15,109.79 కోట్లు వచ్చినట్లయింది.

Updated Date - Jan 11 , 2025 | 02:44 AM