Hyderabad: చర్లపల్లి నుంచి చెన్నై, గోరఖ్‌పూర్‌కు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ABN , Publish Date - Jan 09 , 2025 | 06:59 AM
అధునాతన సౌకర్యాలతో ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్(Cherlapalli Terminal) నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ వెళ్లే రెండు రైళ్ల తేదీలను అధికారులు ఖరారు చేశారు. మార్చి 7వ తేదీ సాయంత్రం 16.45 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే (నం. 12603) రైలు 8వ తేదీ ఉదయం 5.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
హైదరాబాద్: అధునాతన సౌకర్యాలతో ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్(Cherlapalli Terminal) నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ వెళ్లే రెండు రైళ్ల తేదీలను అధికారులు ఖరారు చేశారు. మార్చి 7వ తేదీ సాయంత్రం 16.45 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే (నం. 12603) రైలు 8వ తేదీ ఉదయం 5.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరిగి 8వ తేదీ సాయంత్రం 17.25 గంటలకు బయలుదేరి (నం.12604) మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది.
ఈ వార్తను కూడా చదవండి: ఇంటర్ మెుదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య.. విషయం ఇదే..
గోరఖ్‌పూర్(Gorakhpur) నుంచి మార్చి 12వ తేదీ ఉదయం 6.35 గంటలకు బయలు దేరే రైలు (నం. 12589) 13వ తేదీ ఉదయం 6.40 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. అదేరోజు రాత్రి 21.45 గంటలకు బయలు దేరి 14వ తేదీ మధ్యాహ్నం 13.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుతుంది. ఈ రెండు రైళ్లు మార్చి 8, 13 తేదీల నుంచి రెగ్యులర్‌గా నడుస్తాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి(Secunderabad, Kacheguda, Nampally) వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తోడు అదనంగా మరో మూడు రైళ్లకు అధికారులు బుధవారం చర్లపల్లిలో ఒక నిమిషం పాటు హాల్టింగ్ ఇచ్చారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్(Sirpur Kagaznagar to Secunderabad)కు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు (నెం.12757/12758), సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు నడిచే రైలు (నం.17233/17234)తో పాటు గుంటూరు-సికింద్రాబాద్-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు (నం.17201/ 17202) ఒక నిమిషం పాటు చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిచాయి.
ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్
ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు
Read Latest Telangana News and National News