Share News

Dr. Lakshman: కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వం..: ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:42 PM

కాంగ్రెస్ కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వంమని, రైతు రుణ మాఫీ.. రైతు భరోసా అన్ని ఎగవేతలేనని, ఎన్నికల ముందు వరంగల్ సభలో రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తామని.. ఇప్పుడు రూ. 12 వేలకు కోత పెట్టారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. మాయ మాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ గ్యారెంటీలన్ని నీటి మూటలేనని విమర్శించారు.

Dr. Lakshman: కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వం..: ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై బీజేపీ ఎంపీ (BJP MP) డాక్టర్ లక్ష్మణ్ (Dr. Lakshman) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన అశోక్ నగర్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వంమని, రైతు రుణ మాఫీ..రైతు భరోసా అన్ని ఎగవేతలేనని, ఎన్నికల ముందు వరంగల్ సభలో రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తామని.. ఇప్పుడు రూ. 12 వేలకు కోత పెట్టారని ఆరోపించారు. మాయ మాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ గ్యారెంటీలన్ని నీటి మూటలేనని విమర్శించారు. రైతు భరోసాలో కౌలు రైతుల ఉసే లేదని, రైతు భరోసా మొన్నటి వరకు సంక్రాంతి నుండి ఇస్తామని ఉదర గొట్టారని.. ఇప్పుడు జనవరి 26 అని అంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం దగ్గర రైతుల డేటా మొత్తం ఉన్నప్పుడు మళ్ళీ సర్వేలు ఎందుకని ప్రశ్నించారు.


కాంగ్రెస్ అంటేనే మోసంకు నిర్వచనం..

కాంగ్రెస్ అంటేనే మోసంకు నిర్వచనమని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు ప్రజలను.. రైతులను మోసం చేసిన వారేనని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు అండగా బీజేపీ పోరాటానికి సిద్ధం అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రైతుల కోసం ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంను వెంటాడతామని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేమని.. కాంగ్రెస్ నేతలు నేలకు ముక్కు రాసి ప్రజలను క్షమాపణలు కోరాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ (Dr. K. Lakshman) అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌(BRS) నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజా సమస్యలను పక్కనపెట్టి విమర్శలకు దిగుతున్నారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..

మోసానికి మారు పేరు కాంగ్రెస్: కేటీఆర్

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..

విశాఖ కలెక్టరేట్‌లో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం

కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి ఆత్మహత్య..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 05 , 2025 | 12:42 PM