Share News

KTR: ఆ కేసు గురించి ఆందోళన వద్దు..

ABN , Publish Date - Jan 08 , 2025 | 02:46 PM

Telangana: ‘‘ఫార్ములా ఈరేసు కేసు గురించి నేను చూసుకుంటాను. ఏసీబీ కేసు పెద్ద విషయం కాదు. నా కేసుల గురించి ఆందోళన, ఇబ్బంది లేదు’’ అని కేటీఆర్ అన్నారు. సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ రేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని వెల్లడించారు.

KTR: ఆ కేసు గురించి ఆందోళన వద్దు..
Former minister ktr

హైదరాబాద్, జనవరి 8: ఫార్ములా ఈ రేసు కేసుపై (Formula E Car Race Case) మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఫార్ములా ఈరేసు కేసు గురించి నేను చూసుకుంటాను. ఏసీబీ కేసు పెద్ద విషయం కాదు. నా కేసుల గురించి ఆందోళన, ఇబ్బంది లేదు’’ అని అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ రేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రైతు, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 2025లో బీఆర్ఎస్‌కు కొత్త కమిటీలు పూర్తి చేస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు నియమిస్తామన్నారు. ఈఏడాది పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. జిల్లాల్లోనే పార్టీ క్యాడర్‌కు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ప్రయోజనాల‌ కోసం బీఆర్ఎస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతన్నకు జరుగుతోన్న మోసాన్ని ప్రజలకు వివరించాలని.. మెత్తంగా 30 శాతం రుణమాఫీ మాత్రమే జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.


కేటీఆర్‌కు పార్టీ అండ: హరీష్ రావు

harish-rao.jpg

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ డైరినీ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ఆనాడు డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా ఉండేవని... నేటి డైరీ ఆవిష్కరణ తిరిగి బీఆర్ఎస్‌ను అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి సంవత్సర కాలంగా చేసింది ఎగవేతలు, కేసులే అని వ్యాఖ్యలు చేశారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. డైవర్షన్‌లు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమిలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా వేస్తారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌లు పెంచిందన్నారు.

కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ..? హైకోర్టు కీలక వ్యాఖ్యలు..


ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి భూములకు ఆరులైన్ల రోడ్లు వేసుకుంటున్నారని.. అప్పులపై అసెంబ్లీలోనే ప్రభుత్వం నోరు మూయించామన్నారు. లగచర్ల రైతులకు అండగా కేటీఆర్ నిలబడ్డారని.. కేటీఆర్ ఉద్యమకారుడు, కార్యకర్తే అని తెలిపారు. ఆయనకు ఆపద వస్తే పార్టీ అంతా అండగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా అండగా నిలబడుతుందని హరీష్‌రావు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం

IT Raids: హన్సిత, అనిల్ కేస్.. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 08 , 2025 | 03:49 PM