Share News

Siddepet: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్.. విషయం ఇదే..

ABN , Publish Date - Jan 10 , 2025 | 05:46 PM

తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula E car race) కేసు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌(KCR)ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Siddepet: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్.. విషయం ఇదే..
KCR and KTR

సిద్దిపేట: ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula E car race) కేసు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌(KCR)ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇవాళ (శుక్రవారం) సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (Erravalli) వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రితోపాటు బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి సైతం సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిన్న (గురువారం) జరిగిన ఏసీబీ విచారణకు సంబంధించిన పలు అంశాలను కేసీఆర్‌ దృష్టికి కేటీఆర్ తీసుకువచ్చారు. ఏసీబీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను చెప్పిన సమాధానాలను పూసగుచ్చినట్లు వివరించారు.

TG Highcourt: ఆ షోలు రద్దు చేశామంటూ మళ్లీ ఏంటిది.. హైకోర్టు అసంతృప్తి


అలాగే ఈనెల 16న ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉందని పార్టీ అధినేతకు కేటీఆర్ తెలిపారు. దీంతో ఈనెల 16న ఈడీ విచారణను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై కేటీఆర్‌కు ఆయన దిశానిర్దేశం చేశారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు, కేసులతోపాటు పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపైనా నేతలకు కేసీఆర్ సూచనలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

TG Politics: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చిన బీజేపీ.. అందరి కంటే ముందే..

BLN Reddy: ఏసీబీ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడి..

Updated Date - Jan 10 , 2025 | 05:50 PM