Share News

Hyderabad Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్.. బకాయిలు ఎంత పేరుకుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Feb 22 , 2025 | 10:33 AM

హైదరాబాద్: ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వారికి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. వారికి రెడ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా సమాధానం చెప్పకపోతే ఆస్తులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Hyderabad Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్.. బకాయిలు ఎంత పేరుకుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు..
Hyderabad Property Tax

హైదరాబాద్: బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ (Property Tax) వసూళ్లకు సంబంధించి జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. జీహెచ్ఎంసీకి కొంతమంది కోట్ల రూపాయల పన్నులను ఎగవేసినట్లు (Tax Evasion) అధికారులు గుర్తించారు. ఏళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో అవి కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు నిర్ధారించారు. బకాయిల వసూలు కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ఈ సంచలన విషయాలను గుర్తించినట్లు జీహెచ్ఎంపీ అధికారులు తెలిపారు.


ఈ మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఒక్క ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే 100 మందికి రెడ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నోటీసులకు స్పందించకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని హెచ్చరించారు బల్దియా అధికారులు. రూ.5 లక్షలకు పైన ఉన్న బకాయిల విలువ ఏకంగా రూ.860 కోట్లని అధికారులు తేల్చారు. జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి విలువ రూ.52 కోట్లని, ఎల్ అండ్ టీ మెట్రో రైలు బకాయి రూ.32 కోట్లని అధికారులు గుర్తించారు.


హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ రూ.30 కోట్లు చెల్లించాలని, ఇండో అరబ్ లీగ్ రూ.7.33 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రూ.5.50 కోట్లు, సోమాజిగూడలోని కత్రియా హోటల్ రూ.8.62 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి పన్నులు చెల్లించాలని తెలిపారు. వీరంతా తాము జారీ చేసిన రెడ్ నోటీసులకు స్పందించాలని, లేకుంటే ఆస్తులను సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు

KTR: భూగర్భ జలాలు ఎండిపోవడానికి వారే కారణం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Updated Date - Feb 22 , 2025 | 10:35 AM